అండర్‌వరల్డ్ బ్యాక్‌డ్రాప్‌తో సినిమాలు చేస్తూ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు రాంగోపాల్ వర్మ.ఈ తరహా సినిమాలు తీసి బాలీవుడ్లో ఓ కొత్త ట్రెండ్‌కు నాంది పలికాడు రామ్‌గోపాల్‌వర్మ(Ram gopal varma).
అండర్‌వరల్డ్ బ్యాక్‌డ్రాప్‌తో ఆర్జీవీ (RGV) చేసిన ఫస్ట్ మూవీ ‘సత్య (1998)’(Satya (1998).బాలీవుడ్ ప్రేక్షకులకే కాకుండా ఈ సినిమా భారతదేశంలోని ప్రజలందరూ మెచ్చారు.
దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘కంపెనీ (2002) Company (2002),’ మూవీ సూపర్ హిట్టైతే 2005లో ‘డి’ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ముంబై మాఫియా నేపథ్యంలోనే తీసిన ఈ సినిమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
అయితే ‘కంపెనీ’ సినిమా గురించి చెప్పుకోదగిన చాలా విశేషాలు ఉన్నాయి.ఆ విశేషాలేమో తెలుసుకుందాం.
సాధారణంగా దర్శకులు తాము చేసే సినిమాలోని క్యారెక్టర్లకు ఎవరు సూటవుతారో ఆలోచిస్తారు.సూట్ అవ్వడమే కాదు ఆ క్యారెక్టర్లకు న్యాయం ఎవరు చేయగలరు అనేది కూడా బాగా ఆలోచిస్తారు చివరికి ఒక జడ్జిమెంట్ తీసుకొని దాని ప్రకారమే నటీనటులను సెలెక్ట్ చేసుకుంటారు.
అదేవిధంగా రామ్ గోపాల్ వర్మ కంపెనీ చిత్రంలో మూడు క్యారెక్టర్ల కోసం ముగ్గురు నటులను ఎంపిక చేసుకుందామని అనుకున్నారు.కానీ చివరికి వారికి బదులు వేరే యాక్టర్లను తీసుకున్నారు.

ఈ సినిమాలో మాలిక్ అనే ప్రధాన పాత్రలో షారూక్ ఖాన్ని(ShahRukh Khan) సెలెక్ట్ చేసుకోవాలని రాంగోపాల్ వర్మ అనుకున్నాడు.ఇదే విషయమై షారుఖ్ ఖాన్ ని కాంటాక్ట్ కూడా అయ్యాడు.కానీ చివరికి ఆ క్యారెక్టర్ కోసం అజయ్ దేవ్‌గణ్‌ని(Ajay Devgan) సెలెక్ట్ చేసుకోవడం జరిగింది.అది కూడా తన ఇష్టంతోనే ఎందుకంటే ఆ సమయంలో రామ్ గోపాల్ వర్మ కి షారూఖ్ హైపర్ యాక్టివ్‌గా కనిపించాడట.
మాలిక్ క్యారెక్టర్ మాత్రం చాలా సైలెంట్‌గా ఉంటూ వయెలెన్స్ క్రియేట్ చేసే క్యారెక్టర్.దానికి అజయ్ మాత్రమే 100% న్యాయం చేయగలరని వర్మ అనుకుని అతనికే ఆ పాత్ర అందించాడు.

ఈ సినిమాలో మరో మెయిన్ క్యారెక్టర్ పోలీస్ కమిషనర్.అది కమల్‌హాసన్(Kamal Haasan) కు ఇవ్వాలని ఆర్జీవి భావించాడు.కానీ, కమల్ బాడీ లాంగ్వేజ్ పోలీస్ కమిషనర్ క్యారెక్టర్ కు సెట్ కాదని తర్వాత రియలైజ్ అయ్యి, అతని స్థానంలో మోహన్‌లాల్‌ని(Mohanlal) ఎంపిక చేసుకున్నాడు.కంపెనీ మూవీలో చంద్రకాంత్ క్యారెక్టర్ కూడా చాలా కీలకమైనది.
దీనికోసం అభిషేక్ బచ్చన్‌ని తీసుకుందామని అనుకున్నాడు.క్యారెక్టర్ నచ్చడంతో అభిషేక్ తనకు ఒకే అని చెప్పాడు.
అయితే అభిషేక్ వేరే సినిమాలతో చాలా బిజీగా ఉండటంవల్ల వర్మ చెప్పిన డేట్స్‌లో అందుబాటులో ఉండలేకపోయాడు.

ఫలితంగా ఆ క్యారెక్టర్ వివేక్ ఓబెరాయ్ చెంతకు చేరింది.అలా షారూక్ ఖాన్, కమల్‌హాసన్, అభిషేక్ బచ్చన్ ఈ సినిమాలో కనిపించడానికి బదులుగా వారి స్థానంలో అజయ్ దేవ్‌గణ్, మోహల్‌లాల్, వివేక్ ఓబెరాయ్‌లు కనిపించడం జరిగింది.అయితే వర్మ అనుకున్నట్లయితే వీరందరూ కూడా చాలా బాగా నటించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఈ మూవీ సూపర్ హిట్ అయింది.