స్వీట్ కార్న్ తింటే బ‌రువు పెరుగుతారా?

స్వీట్ కార్న్( Sweet Corn ) చాలా మందికి మోస్ట్ ఫేవ‌రెట్ అని చెప్పుకోవ‌చ్చు.పిల్ల‌లు, పెద్ద‌లు ఎంతో ఇష్టంగా తినే రుచిక‌ర‌మైన స్నాక్ ఇది.

 Will Eating Sweet Corn Make You Gain Weight Details, Weight Gain, Sweet Corn, L-TeluguStop.com

అందుకే పెద్ద పెద్ద మాల్స్ లో కూడా స్వీట్ కార్న్ స్టాల్స్ ద‌ర్శ‌న‌మిస్తుంటాయి.సాధార‌ణ మొక్క‌జొన్న‌తో పోలిస్తే.

స్కీట్ కార్న్ ఎక్కువ రుచిక‌రంగా మ‌రియు మృదువుగా ఉంటాయి.అలాగే స్వీట్ కార్న్ లో ఫైబర్, విటమిన్ ఎ, విట‌మిన్ బి, విట‌మిన్ సి మ‌రియు యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా నిండి ఉండ‌టం వ‌ల్ల ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి.

అయితే స్వీట్ కార్న్ తింటే బ‌రువు పెరుగుతార‌ని( Weight Gain ) కొంద‌రు న‌మ్ముతారు.

Telugu Corn, Dietary Fiber, Tips, Latest, Obesity, Sweet Corn, Sweetcorn-Telugu

స్వీట్ కార్న్‌లో మితమైన స్థాయిలో క్యాలరీలు ఉంటాయి.ఒక కప్పు(150 గ్రాములు) స్వీట్ కార్న్‌లో సుమారు 120 నుంచి 130 క్యాలరీలు ఉంటాయి.ఇవి తక్కువ కాదు అలా అని ఎక్కువ కూడా కాదు.

అలాగే కార్బోహైడ్రేట్లు 27 గ్రాముల వ‌ర‌కు ఉంటాయి.మంచి మోతాదులో ఫైబర్, ప్రోటీన్‌ ఉంటుంది.

అందువ‌ల్ల స్వీట్ కార్న్ ను మితంగా తీసుకుంటే బ‌రువు పెరిగే అవ‌కాశాలు ఉండ‌వు.ఒక‌వేళ ఒక క‌ప్పుకు మించి తీంటే అదనపు క్యాలరీలు చేరి బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

స్వీట్ కార్న్ కు నెయ్యి, చీజ్ లాంటివి చేర్చి తీసుకున్నా వెయిట్ గెయిన్ అవుతారు.

Telugu Corn, Dietary Fiber, Tips, Latest, Obesity, Sweet Corn, Sweetcorn-Telugu

ఇక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల విష‌యానికి వ‌స్తే.స్వీట్ కార్న్ లోని డైటరీ ఫైబర్( Dietary Fiber ) పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.

కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.అలాగే స్వీట్ కార్న్ లో స‌మృద్ధిగా ఉండే ఫోలేట్, పొటాషియం హృదయ సంబంధిత వ్యాధుల నుంచి ర‌క్ష‌ణ క‌ల్పిస్తాయి.

స్వీట్ కార్న్ లోని ల్యూటిన్, జియాజంతిన్ వంటి క్యారటెనాయిడ్లు కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి.కంటి చూపును పెంచుతాయి.

అంతేకాదండోయ్‌.మేమొరీ పవర్ పెంచడంలో, మెదడు కార్యకలాపాలను మెరుగుపర‌చ‌డంలో స‌హాయ‌ప‌డే విట‌మిన్ బి1ను మ‌నం స్వీట్ కార్న్ ద్వారా పొంద‌వ‌చ్చు.స్వీట్ కార్న్ లోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని వ్యాధుల నుండి కాపాడతాయి.చర్మానికి నిగారింపు తీసుకువస్తాయి.

గ‌ర్భిణీ స్త్రీల‌కు కూడా స్వీట్ కార్న్ ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube