యాపిల్ ఆరోగ్యానికి ఎంతో మంచిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఎన్నో జబ్బులకు చెక్ పెట్టే ఔషధ గుణాలు యాపిల్‌లో పుష్కలంగా ఉన్నాయి.
అందుకే రోజుకో యాపిల్ తింటే డాక్టర్ ను దూరంగా ఉంచొచ్చు అని అంటుంటారు.రక్త హీనత తగ్గించడంలో.
క్యాన్సర్ వంటి భయంకర సమస్యల నుంచి రక్షించడంలో.శరీరంలో షుగర్‌ను కంట్రోల్ చేయడంలో.
అధిక కొవ్వును కరిగించడంలో.ఇలా చెప్పుకుంటే పోతో యాపిల్ ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది.అయితే కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు.చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేయడంలోనూ యాపిల్ గ్రేట్‌గా సహాయపడుతుంది.యాపిల్‌ను చర్మానికి యూజ్ చేయడం వల్ల మేకప్ లేకపోయినా అందంగానే కనిపిస్తారు.మరి యాపిల్‌ను చర్మానికి ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా యాపిల్ ముక్కలను బాగా పేస్ట్ చేసి.అందులో కొద్దిగా తేనె మిక్స్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్ వేసుకుని.అరగంట తర్వాత క్లీన్ చేసుకోవాలి.

ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల మొటిమల, మచ్చలు తగ్గుముఖం పడతాయి.అలాగే ముఖం కొత్త కాంతిని సంతరించుకుంటుంది.యాపిల్‌ను వేడినీళ్ళలో వేసి మెత్తగా ఉడికించుకోవాలి.ఆ తర్వాత తొక్కను తొలగించి.పేస్ట్ చేసుకోవాలి.ఈ పేస్ట్‌లో గోధుమపిండిని మిక్స్ చేసి.
ముఖానికి పట్టించాలి.పావు గంట తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి.
ఇలా చేడయం వల్ల మృదువుగా, కోమలంగా మారుతుంది.అలాగే చర్మంపై ఉన్న మృత కణాలను తొలగించి.న్యాచురల్ కలర్‌ను అందిస్తుంది.ఇక యాపిల్‌ను తొక్కతో పాటు పేస్ట్ చేసి.
అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించాలి.పావు గంట పాటు ఆరనిచ్చి.
అనంతరం గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి.ఈ ప్యాక్ వల్ల ముఖం అందంగా, కాంతివంతంగా మారుతుంది.