సాధారణంగా కొందరి ముఖం, శరీరంలో ఎంత తెల్లగా, కాంతివంతంగా ఉన్నా.చేతులు మాత్రం నల్లగా, కాంతిహీనంగా కనిపిస్తాయి.
చేతులు నల్లగా మారడానికి చాలా కారణాలు ఉన్నాయి.సన్ టాన్, పోషకాల లోపం, డీహైడ్రేషన్, సన్ స్క్రీన్ లోషన్ ఎవాయిడ్ చేయడం ఇలా రకరకాల కారణాల వల్ల చేతులు నల్లగా మారతాయి.
దాంతో చేతులను తెల్లగా మార్చుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు.బ్యూటీ పార్లర్స్ చుట్టు తిరుగుతూ.
ఎంతో ఖర్చు పెడుతుంటారు.కానీ, చిన్న చిన్న చిట్కాలును ఇంట్లనే పాటిస్తే.
సులభంగా నల్లని చేతులను తెల్లగా మార్చుకోవచ్చు.
మొదటిది.
ముందుగా ఒక బౌల్‌లో కొద్దిగా చందనం పొడి, పాలు మరియు కొబ్బరి నీరు వేసి బాగా కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని చేతులకు అప్లై చేసి.
ఇరవై లేదా ముప్పై నిమిషాల పాటు ఆరనివ్వాలి.ఆ తర్వాత కొద్దిగా నీళ్లు జల్లి.
మెల్లగా రుద్దుతూ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా వారంలో రెండు సార్లు చేస్తే.
చేతులు తెల్లగా మరియు అందంగా మారతాయి.
రెండొవది.
ఒక బౌల్‌లో బొప్పాయి గుజ్జు, టమాటా గుజ్జు మరియు నిమ్మ రసం వేసి మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని చేతులకు పూతలా వేసి.
అర గంట పాటు వదిలేయాలి.అనంతరం గోరు వెచ్చని నీటితో చేతులను వాష్ చేసుకోవాలి.
ఇలా వారంలో రెండు లేదా మూడు సార్లు చేస్తూ ఉంటే.క్రమంగా మీ చేతులు తెల్లగా మారతాయి.
పైనాపిల్ కూడా నల్లని చేతులను తెల్లగా మార్చగలదు.పైనాపిల్ పేస్ట్ చేసి రసం తీసుకోవాలి.ఇప్పుడు ఈ రసంలో కొద్దిగా తేనె వేసి బాగా కలిపి.చేతులకు బాగా అప్లై చేయాలి.
పావు గంట లేదా ఇరవై నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా తరచూ చేసినా.
మంచి ఫలితం కనిపిస్తుంది.