యంగ్ హీరో నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి డైరెక్షన్ లో తెరకెక్కిన చెక్ మూవీ ఈ శుక్రవారం విడుదల కానున్న సంగతి తెలిసిందే.విడుదలకు ముందే అంచనాలు పెంచిన ఈ సినిమాలో రకుల్ తో పాటు ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తున్నారు.
ఈ సినిమాలో నితిన్ ఉరిశిక్ష పడ్డ ఖైదీగా నటిస్తున్నారు.ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు కేవలం 16 కోట్ల రూపాయలకే విక్రయించినట్లు తెలుస్తోంది.
క్లాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిన సినిమా కావడంతో ఈ సినిమా హక్కులను తక్కువ మొత్తానికే విక్రయించినట్టు తెలుస్తోంది.ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచగా నితిన్ కెరీర్ లో చెక్ అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఉప్పెన మూవీ హక్కులు 20 కోట్ల కంటే ఎక్కువ మొత్తానికి అమ్ముడవగా చెక్ హక్కులు మాత్రం 20 కోట్ల రూపాయల కంటే తక్కువ మొత్తానికి అమ్ముడవడం గమనార్హం.
చెక్ సినిమా నైజాం ఏరియా హక్కులను వరంగల్ శ్రీను 5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.
అయితే థియేట్రికల్ హక్కుల ద్వారా తక్కువ మొత్తమే వచ్చినా చెక్ మూవీ శాటిలైట్, డిజిటల్ హక్కులు 12 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.కళ్యాణి మాలిక్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈ ఏడాది నితిన్ నటించిన మూడు సినిమాలు విడుదల కానుండగా తొలి సినిమాగా చెక్ విడుదలవుతోంది.రంగే, అంధాధూన్ రీమేక్ సినిమాలు కూడా ఈ ఏడాదే విడుదల కానున్నాయి.తక్కువ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలో దిగుతున్న చెక్ మూవీ బ్రేక్ ఈవెన్ కావడానికి ఎన్ని రోజులు పడుతుందో చూడాల్సి ఉంది.ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేని చంద్రశేఖర్ ఏలేటి, రకుల్, ప్రియా ప్రకాష్ వారియర్ ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు.