టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సింగర్ గా సునీత(singer sunitha) తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే.సింగర్ సునీత ప్రవస్తి (singer sunitha, pravasthi)ఆరోపణల గురించి రియాక్ట్ కాగా ఆమె రియాక్షన్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.
ప్రవస్తి( Pravasthi).నిన్ను బాల్యంలో నేను ముద్దు చేశానని సునీత తెలిపారు.
ఈ వయస్సులో అలా చేస్తే బాగుండదు కదా అని సునీత అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఎవరు బాగా పాడినా మేము లీనమై భావోద్వేగానికి గురవుతూ ఉంటామని సునీత తెలిపారు.
ఆయా ఎపిసోడ్లు నువ్వు చూడలేదనుకుంటామని సునీత (Sunitha)చెప్పుకొచ్చారు.మా గురించి చర్చించే స్థాయికి నువ్వు వెళ్లినందుకు అసంతృప్తిగా ఉందని సునీత తెలిపారు.
నువ్వు ఎన్నో పోటీల్లో పాల్గొన్నావని ప్రాసెస్ ఎలా ఉంటుందో నీకు తెలియదా అని ఆమె ప్రశ్నించారు.

కొన్ని ఛానెళ్లకు కొన్ని పాటలకే హక్కులు ఉంటాయని ఆడియన్స్ కు ఇలా అన్ని విషయాలు చెప్పు అని అప్పుడు నిజంగా నేను సంతోషిస్తానని సునీత తెలిపారు.మూజిక్ విషయంలో టీవీ ఛానెళ్లకు(TV channels) కొన్ని పరిమితులు ఉంటాయని కాబట్టి అన్ని పాటలు పాడే ఛాన్స్ ఉండదని రైట్స్ ఉన్నవి మాత్రమే పోటీలో పాడాలని ఆమె చెప్పుకొచ్చారు.సునీత కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సింగర్ సునీత కామెంట్ల గురించి ప్రవస్తి ఏ విధంగా భావిస్తారో చూడాల్సి ఉంది.ప్రతి పోటీలో గెలుపోటములు సాధారణం అని ప్రవస్తికి కొందరు నెటిజన్లు సూచిస్తున్నారు.సంగీతంలో జడ్జీల స్థానం ఊరికే కాదని వాళ్ల గురించి నోటికొచ్చిన విధంగా కామెంట్లు చేయడం తప్పేనని మరి కొందరు చెబుతున్నారు.కొంతమంది మాత్రం జడ్జీలపైనే ట్రోల్స్ చేస్తుండటం కొసమెరుపు.
ఈ ఉహించని వింత వివాదం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.