సూర్యాపేట జిల్లా:కోదాడలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి బాధాకరమని జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు.
సోమవారం రాత్రి మునగాల మండలం ముకుందాపురం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రాంబాబు భౌతికయానికి పూలమాల వేసి నివాళులు ఘటించారు.మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి మనోధైర్యాన్ని నింపారు.
ఈ కార్యక్రమంలో సిఐలు రామకృష్ణా రెడ్డి,వీరరాఘవులు,ఎస్ఐలు ప్రవీణ్ కుమార్,మల్లేశం తదితరులు పాల్గొన్నారు.







