ఒక్కోసారి ఏదైనా ఫంక్షన్ కు, మీటింగ్ కు లేదా ఇష్టమైన వారితో డేటింగ్ కు వెళ్లాల్సి వచ్చినప్పుడు ముఖం నల్లగా కాంతిహీనంగా ఉంటే ఎంతో ఆవేదన చెందుతుంటారు.అసలు అటువంటి ముఖంతో బయట కాలు పెట్టాలంటేనే సంకోచిస్తుంటారు.
అయితే అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే ఎంత నల్లగా ఉన్నా సరే క్షణాల్లో మీ ముఖం తెల్లగా కాంతివంతంగా మారడం ఖాయం.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సింపుల్ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్లు షుగర్( Sugar ) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ తేనె,( honey ) హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ మరియు అర కప్పు వాటర్ వేసుకుని రెండు నిమిషాల పాటు మరిగించాలి.
ఇలా మరిగించిన వాటర్ ను చల్లారబెట్టుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్( Coffee powder ), వన్ టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి.

అలాగే సరిపడా తయారు చేసి పెట్టుకున్న షుగర్ వాటర్ ను కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు కావాలి అనుకుంటే చేతులకు పూతలా అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత వేళ్ళతో సున్నితంగా చర్మాన్ని రబ్ చేసుకుంటూ ప్యాక్ ను తొలగించాలి.

అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఈ సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే చర్మంపై పేరుకుపోయిన మురికి, మృతకణాలు తొలగిపోతాయి.క్షణాల్లో చర్మం వైట్ గా సూపర్ గ్లోయింగ్ గా మారుతుంది.
స్కిన్ డల్ నెస్ సైతం ఎగిరిపోతుంది.ఇన్స్టెంట్ స్కిన్ వైట్నింగ్ కి ఈ రెమెడీ చాలా ఉత్తమం గా సహాయపడుతుంది.
కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.