నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచం నలుమూలల నుంచి విచిత్ర ఘటనలు, వినూత్న ఆవిష్కరణలు, సరదా ప్రయోగాలు క్షణాల్లో వైరల్( Viral ) అవుతూ కనిపిస్తుంటాయి.ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ వంటి ప్లాట్‌ఫార్ముల ద్వారా ప్రజలు తమ వినూత్న ఆలోచనలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు.
వాటిలో కొన్ని విచిత్రంగా, కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని హాస్యాస్పదంగా ఉంటూ ప్రజల్ని ఆకర్షిస్తున్నాయి.ఇలాంటి వీడియోలే అప్పుడప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.
తాజాగా అలాంటి ఒక వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి ఇంటి తలుపుల స్థానంలో ఫ్రిడ్జ్ డోర్లను( Fridge Doors ) అమర్చిన తీరు చూసి అందరూ అవాక్కవుతున్నారు.
సాధారణంగా ఫ్రిడ్జ్‌ను ఆహార పదార్థాలను స్టోర్ చేయడానికే వాడతాం.కానీ ఈ వ్యక్తి మాత్రం ఫ్రిడ్జ్‌ను వినూత్నంగా వాడే ప్రయత్నం చేశాడు.అతను చేసిన ఈ ప్రయోగం మొదట కాస్త ఆశ్చర్యంగా అనిపించినా, కొద్దిసేపటికి చిత్తశుద్ధితో చూసిన వారు మాత్రం నవ్వుకోకుండా ఉండలేకపోతున్నారు.

వీడియోలో గమనించినట్లయితే.ఒక వ్యక్తి ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్లి దాని డోర్‌ను తెరిచాడు.అందరూ అందులో ఏదైనా తినుబండారాలు ఉండొచ్చని అనుకున్నారు.
కానీ అది ఓ ఇంటి తలుపుగా మార్చబడి ఉండటం నెటిజన్లను షాక్‌కి గురిచేసింది.ఫ్రిడ్జ్ డోర్ తెరిచిన వెంటనే ఇంటి బయట దృశ్యం కనిపించడం అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది.
ఇంటి తలుపులకు బదులుగా ఫ్రిడ్జ్ డోర్లు ఎలా అమర్చారో తెలియదు గానీ, ఆ ఆలోచన మాత్రం ఇప్పుడంతటా చర్చకు దారితీస్తోంది.

ఈ వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘ఫ్రిడ్జ్ ను ఇలా లాకూడా వాడొచ్చా?’’ అని కొందరు కామెంట్ చేస్తుండగా, మరికొందరేమో ‘‘ నీ క్రియేటివిటీకి జోహార్ అంటూ!’’ కొందరు కామెంట్లు చేస్తున్నారు.ఈ తరహా వీడియోలు ఎంత హాస్యాస్పదంగా ఉన్నా, వాటి వెనుకున్న క్రియేటివిటీకి అభినందనలందడం తప్పుకాదు.
వైరల్ వీడియోలు నేడు కేవలం వినోదానికి కాదు, ఒక పంథాలో ఊహించని కోణాల్లో ఆలోచించేందుకు ప్రేరణ కూడా కలిగిస్తున్నాయి.ఇకపై ఫ్రిడ్జ్‌ను చూస్తే అందులో కోల్డ్ డ్రింక్ ఉన్నా లేనన్నా, తలుపు తెరిస్తే బయటకు దారితీయవచ్చని గుర్తు తెచ్చుకునే అవకాశం మాత్రం పక్కా.