ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.08
సూర్యాస్తమయం: సాయంత్రం 06.09
రాహుకాలం:సా.4.30 ల6.00 వరకు
అమృత ఘడియలు:అమావాస్య మంచి రోజు కాదు వరకు
దుర్ముహూర్తం: సా.5.02 ల5.53 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు ప్రారంభించిన పనుల్లో అంతా మంచే జరుగుతుంది.మీరు చేసే ఉద్యోగంలో పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.మీపై ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు.అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడమే మంచిది.
వృషభం:
ఈరోజు మీరు చేసే వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది.స్థలం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతి అందుతుంది.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండటమే మంచిది.
మిథునం:
ఈరోజు మీరు మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.అనవసరమైన విషయాలలో తలదిర్చకండి.
కర్కాటకం:
ఈరోజు మీరు మీపై ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు.మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచనలు అవసరం.
సింహం:
ఈరోజు మీరు ప్రారంభించిన పనులు చాలా త్వరగా పూర్తి చేస్తారు.మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.వారితో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
కన్య:
ఈరోజు మీరు చేసే పనుల్లో మార్పుల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేయకపోవడం మంచిది.తోటి వారి సహాయం ఇంకెప్పుడు ఉంటుంది.
తులా:
ఈరోజు కొందరు ప్రవర్తన మీ మనసులో బాధను కల్పిస్తుంది.అనవసరంగా ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.ప్రారంభించిన పనులు వాయిదా వేసుకోవడమే మంచిది.
ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగా అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చికం:
ఈరోజు మీరు స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాటు వలన కుటుంబ సభ్యులు మానసి ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.విద్యార్థులు దేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.
ధనస్సు:
ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనం చేసుకుంటారు.ప్రయాణం చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కానీ తిరిగి సంపాదించ స్తోమత మీలో ఉంటుంది.
మకరం:
ఈరోజు మీరు ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన అంతా శుభమే జరుగుతుంది.తోటి వారి సహాయం మీ ఇంకెప్పుడు ఉంటుంది.
కుంభం:
ఈరోజు మీరు ఎప్పటినుండో ఉన్న కోర్ట్ సమస్యల నుండి బయటపడతారు.మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది.
మీనం:
ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.మీరంటే కిట్టని వారు మీపై నిందలు మోపుతారు.
ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
LATEST NEWS - TELUGU