అన్యుహ రీతిలో రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభం తలెత్తింది.అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్న ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సీఎం గాను తానే కొనసాగాలని మొండికేయడం ఈ సంక్షోభానికి అసలు కారణం.
యువనేత సచిన్ పైలెట్ కు కొచ్చి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అంటున్నారు.అందుకు మద్దతు దారులు అంతా ఆయనకు మద్దతు పలుకుతున్నారు.
అధిష్టానం పై ఒత్తిడి తీసుకువచ్చే ఉద్దేశంతో సీఎం అశోక్ గెహ్లాట్ మద్దతుగా తమ పదవులకు రాజీనామా చేసేందుకు 92 మంది ఎమ్మెల్యేలు సిద్ధపడినట్లు సమాచారం.ఇందులో కొందరు స్వతంత్ర సభ్యులు ఉన్నారు.
వీరంతా బస్సుల్లో శాసనసభ స్పీకర్ సిపి జోషి నివాసానికి వెళ్లారు.రాజీనామా లేఖలను అందజేశారు లేదా అనేది మాత్రం స్పష్టం కాలేదు.
వీరు కాంగ్రెస్ శాసనసభ పక్షం సమావేశానికి హాజరు కాలేదు.
అధిష్టానం పరిశీలకులుగా జైపూర్ వచ్చిన మల్లికార్జున ఖర్గె, అజయ్ మకాన్ లు చాలాసేపు వేచి చూసిన ఎమ్మెల్యేలు రాకపోవడంతో చివరి వరకు సమావేశం జరగలేదు.
తమతో విడివిడిగా నైనా వచ్చి మాట్లాడాలని శాసన సభ్యులను ఉపయోగించేందుకు వారు ప్రయత్నం చేశారు.ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఉన్నారని ఇక తన చేతుల్లో ఏమీ లేదని అధిష్టానానికి గెహ్లాట్ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.
కొత్త తరానికి అవకాశం ఇవ్వాలనేది తన మదిలో ఉందని ఆయన చెపుతున్నారు.ఎట్టి పరిస్థితుల్లో గెహ్లాట్ ప్రాధాన్యం తగ్గకూడదని ఆయన వర్గీయులు గట్టిగా చెబుతున్నారు.ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలను గెహ్లాట్ చేపడితే ఆయన స్థానంలో ముఖ్యమంత్రి ఎవరు అనేది నిర్ణయించేందుకు సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు.

సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో అధిష్టాన నిర్ణయమే తీర్మానాన్ని చేస్తుంటారు.దానికి భిన్నంగా సీఎల్పీ భేటీకి ముందే మంత్రి శాంతి వాసంలో సీఎం అశోక్ గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలు విడిగా సమావేశం అయ్యారు.గెహ్లాట్ సీఎంగా ఉండాలని లేదంటే 2020 లో సచిన్ పైలెట్ తిరుగుబాటు జెండా ఎగరేసినప్పుడు సర్కార్ కు అండగా నిలిచిన వారిలో ఎవరైనా ముఖ్యమంత్రి చేయాలని వారు పట్టు పట్టారు.
దానిలో భాగంగానే తమ రాజీనామా లేఖలను రూపొందించి ఆ మంత్రికి అందజేశారని ఒక వర్గం చెబుతుంది.తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గెహ్లాట్, పైలట్ లను ఢిల్లీకి రావాల్సిందిగా అదిష్టానం ఆదేశించిందని సమాచారం.







