ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల విషయం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు.ఈ పరిస్థితులు ఇప్పుడిప్పుడే సద్దుమనుగుతున్నాయి అనుకుంటున్న క్రమంలో హీరో నాని ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.
ఎక్కడ చూసినా కూడా ఈ విషయం గురించి చర్చించుకుంటున్నారు.ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల విషయంలో తీసుకున్న నిర్ణయం ప్రేక్షకుల్ని అవమానించేలా ఉంది అంటూ నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
శ్యామ్‌సింగరాయ్ రిలీజ్ ముందు రోజు తన సినిమా టీమ్ తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న నాని ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేటు విషయంలో తీసుకున్న నిర్ణయం సరైనది కాదు.ఎందుకంటే టికెట్ ధరలు తగ్గించి ప్రేక్షకులను అవమానించింది.
థియేటర్ల కంటే పక్కన ఉన్న కిరాణా షాపులో కలెక్షన్ ఎక్కువగా ఉంది అంటూ మాట్లాడారు నాని.ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచిన కూడా కొనే సామర్ధ్యం ప్రేక్షకులకు ఉంది అంటూ ఈ సమయంలో నేను ఏది మాట్లాడినా పెద్ద వివాదమే అవుతుంది అని నాని చెప్పుకొచ్చారు.
అనుకున్న విధంగానే నాని చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి.రాజకీయాలలో, సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా నాని చేసిన వ్యాఖ్యల గురించి చర్చించుకుంటున్నారు.

అసలు తెలుగు సినీ ఇండస్ట్రీకి ఈ సమస్య వచ్చింది వకీల్ సాబ్ సినిమా నుంచే.అప్పుడే కనుక టాలీవుడ్ లో అందరూ రియాక్ట్ అయి ఉంటే ఈ పాటికి సమస్యకు పరిష్కారం అయి ఉండేది అని తెలిపారు.ఆ సమయంలో అందరూ ఒక్కటే మాట్లాడి ఉంటే బాగుండేది, ఈరోజు ఇన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉండేది కాదని తెలిపారు నాని.నాని చెప్పిన ఈ కీలక కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
హీరో నాని సినిమాల విషయానికి వస్తే.నాని తాజాగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా తాజాగా విడుదల అయిన విషయం తెలిసిందే.
ఈ సినిమా విడుదల అయి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది.ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.