ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారు టాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ ఉండేవారు.కానీ ఇప్పుడు మాత్రం సౌత్ లో పాపులారిటీ సంపాదించి ఇక బాలీవుడ్ లోకి అడుగు పెట్టి అక్కడ స్టార్ హీరోలకు పోటీ ఇస్తున్న సౌత్ హీరోయిన్లు ఎక్కువై పోతున్నారు.1, 2 సినిమాలకు మాత్రమే పరిమితం అవ్వకుండా వరుస అవకాశాలతో ఇక ముంబై వీధిలు అన్నింటినీ కూడా చుట్టేస్తున్నారు.సౌత్ హీరోయిన్స్ టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా పాగా వేసి సెటిలవ్వాలని గట్టిగానే ట్రై చేస్తున్నారు.
ఇలా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ పై కన్నేసిన హీరోయిన్లు ఒక్కరు ఇద్దరు కాదు దాదాపు టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్లందరూ కూడా వరుస పెట్టి బాలీవుడ్ పై కన్నేసి అక్కడ హడావిడి చేస్తూ ఉండడం గమనార్హం.ఇక ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయిన రష్మిక మందన సౌత్ నార్త్ అంటు నన్ను వేరు చేయొద్దు అంటూ చెబుతోంది.ఇక ఇప్పుడు ముంబైలో తెగ చక్కర్లు కొడుతూ అక్కడే ఆడియన్స్కి బాగా దగ్గర అవుతోంది. విక్కీ కౌశల్, వరుణ్ ధావన్ తో ఆర్ట్ ఫిలింస్ చేసిన ఈ ముద్దుగుమ్మ.
అమితాబ్ బచ్చన్తో గుడ్ బై సిద్ధార్థ మల్హోత్ర తో మిషన్ మజ్ను సినిమాలు చేసి సత్తా చాటేందుకు సిద్ధమైంది.
ఎప్పుడో బాలీవుడ్ చెక్కేసిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటికే పలువురు స్టార్ హీరోలతో యాక్ట్ చేసింది.ఇక ఇప్పుడు అటాక్, రన్ వే 34 లాంటి సినిమాలతో నార్త్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది.ఈ ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.
టాలీవుడ్ లో బుట్ట బొమ్మ గా పేరు సంపాదించుకున్న పూజా హెగ్డే ఇక బాలీవుడ్ లో క్యూట్ భామ గా గుర్తింపు సంపాదించుకుంది. సల్మాన్ ఖాన్ తో కబీ కబీ దివాలి సినిమాల్లో నటిస్తున్న ఈ సొగసరి అందరి దృష్టిని తనవైపు తిప్పుకునేందుకు సిద్ధమైంది.
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత టార్గెట్ కూడా ఇప్పుడు బాలీవుడ్ అన్నది తెలుస్తుంది.వరుణ్ దావత్ తో సినిమాకు కమిట్ అయిన సమంత అటు టాలీవుడ్ని మరోవైపు బాలీవుడ్ ని కూడా రెండు కళ్ళలా చూస్తూ ముందుకు సాగుతోంది.