పీరియడ్స్ లో స్త్రీలు పడే బాధలు వర్ణణాతీతం.ఒంటి నొప్పులతో, మంటతో, మూడ్ స్వింగ్, తలనొప్పితో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు.
పీరియడ్స్ సమయంలో శరీరంలో జరిగే మార్పుల వల్లే ఇన్ని ఇబ్బందులు.అలాంటప్పుడు పర్ఫెక్ట్ డైట్ పాటించాలి.
కొన్నిరకాల ఆహారపదార్థాలు పీరియడ్స్ లో వచ్చే ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
* పీరియడ్స్ లో తలనొప్పి అనేది చాలా సాధారణ విషయం.
ఈ సమస్యను తగ్గించుకోవాలంటే శరీరానికి మెగ్నేషియం అవసరం.అందుకోసం డార్క్ చాకోలేట్, అవోకాడో, చేపలు, అరటిపండు, లీఫీ గ్రీన్స్, యోగ్ రట్,నట్స్ మీద ఆధారపడొచ్చు.
* పీరియడ్స్ లో రక్తస్రావం వలన రక్తం బాగా కోల్పోతారు అమ్మాయిలు.అలాంటప్పుడు ఐరన్ డెఫిషియెన్సి అనే సమస్య దగ్గరికి రావొచ్చు.
దాంతో ఊరికే మూడ్ స్వింగ్ అయిపోతూ ఉంటుంది.అలా కాకూడదు అంటే ఐరన్ బాగా లభించే, బీఫ్, డార్క్ చాకోలేట్, బీట్ రూట్స్, లీఫీ గ్రీన్స్, బీన్స్, క్యారట్ లాంటివి తింటూ ఉండాలి.
* పీరియడ్స్ లో క్రాంప్స్ రావడం దాదాపుగా నరకంతో సమానం.ఈ సమస్య నుంచి కొద్దిపాటి ఉపశమనమైనా పొందాలంటే ఒమెగా 3 ఫాట్టి ఆసిడ్స్, విటమిన్ బి12 అవసరం.
అవి దొరకాలంటే చేపలు, యోగ్ రట్, సీడ్స్, గుడ్డుని డైట్ లో చేర్చుకోవాలి.
* పీరియడ్స్ ఎముకలు బలంగా ఉండాలి.
అలా ఉండాలంటే కాల్షియం లభించే పాలు, చీజ్, బ్రొకోలి, లీఫీ గ్రీన్స్ తీసుకుంటూ ఉండాలి.
* కడుపులో ఉబ్బినట్టుగా అనిపించడం, మంటగా ఉంటే, ఫైబర్ ఇంటేక్ పెంచాలి.
ఆల్మండ్స్, ఆపిల్, స్వీట్ పొటాటో, బెర్రిలలో అవసరమైన ఫైబర్ దొరుకుతుంది.