హీరో వెంకటేష్ గురించి టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం తెలుసు.ఆయన ఎంతగా మొహమాటపడతాడో అలాగే ఆయన ఎంతగా లోప్రొఫైల్ మెయింటైన్ చేస్తాడు అనే విషయం ప్రతి ఒక్క అభిమానికి సుపరిచితమే.
కేవలం ఆయన మాత్రమే కాదు వెంకటేష్ కుటుంబం మొత్తం కూడా అలా లోప్రొఫైల్ మెయింటైన్ చేయడానికి ఇష్టపడతారు.బయట ప్రపంచంతో పెద్దగా కలవరు, అవసరం వచ్చినా కూడా వారి పరిధి మేరకే ఉంటారు.
అందుకే వివాదాలకు ఎలాంటి తావు ఉండదు వెంకటేష్ తో.ఆయన ఫ్యామిలీ మాత్రమే కాదు సినిమాల విషయంలో కూడా వెంకటేష్ చాలా పద్ధతిగా వ్యవహరిస్తారు.ఎక్కడ ఎలా మాట్లాడాలి? ఎంతలా తగ్గి ఉండాలని ఆయనకు తెలిసినంతగా ఇండస్ట్రీలో ఎవ్వరికీ తెలీదు.
అయితే తాజాగా నటుడు మురళీమోహన్ ఒక మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ వెంకటేష్ గురించి సంచలన విషయాలను బయటపెట్టారు.
వెంకటేష్ మొహమాటం గురించి ఆయన అభిమానులతో ముచ్చటించారు.మా అసోసియేషన్ మొదలైనప్పటి నుంచి అధ్యక్షుని స్థానంలో కేవలం హీరోలనే ఉంచాలని మొదట్లో అంతా భావించారట.ఎందుకంటే ఇండస్ట్రీలో ఏ పని జరగాలన్నా కూడా కమెడియన్స్ కానీ, క్యారెక్టర్స్ ఆర్టిస్ట్లు కానీ లేదా చిన్నచిన్న వేషాలు వేసుకునే నటులు చేస్తే ఆ పనులు జరగమని హీరోలైతే తొందరగా చక్కబడతాయని ఒక బలమైన నమ్మకం ఉండేది.అదే నిజం కూడా, ఎందుకంటే హీరోకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అలాగే అందరూ ఆయన మాట వినడానికి ఇష్టపడతారు.
కానీ ఒక చిన్న నటుడు చెబితే పెద్ద హీరోలు వింటారా ? అందుకే హీరోలు మాత్రమే మా అసోసియేషన్ కి అధ్యక్షుడిగా ఉండాలనేది తొలుత కొన్నేళ్ల పాటు కొనసాగింది.చిరంజీవి, నాగార్జున, మోహన్ బాబు సహా చాలామంది నటులు మా అసోసియేషన్ కి అధ్యక్ష పదవిని చేపట్టారు.
కానీ ఒక టర్మ లో హీరో వెంకటేష్ ని మా అధ్యక్ష పదవిని చేపట్టమని అడగగా ఆయన సున్నితంగా తిరస్కరించారట.
మా అసోసియేషన్ మెంబర్స్ అందరూ వెళ్లి కూడా ఆయనని ఎంతో బ్రతిమాలిన కూడా నాకు బయట విషయాలు పెద్దగా తెలియదండి.నా పని ఏంటో అదే చూసుకుంటాను నాకు తెలియని వాటిల్లో వేలు పెట్టలేను అంటూ మా అసోసియేషన్ పదవికి తాను సరిపోనంటూ చెప్పాడట.అయితే మురళీ మోహన్ మరి బలవంతం చేయడంతో ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడిగా ఉండడానికి ఒప్పుకున్నారట.
అలా ఒకసారి ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడిగా పనిచేసిన కూడా ఇప్పటివరకు ఆయన అధ్యక్ష పదవిని చేపట్టలేదు.అలా తన స్వభావం ఏంటో ఆయన ఎంతటి సున్నిత మనసు కలిగిన వాడో మురళీమోహన్ ఇంటర్వ్యూలో పంచుకోగా, ఆ వార్తని వెంకటేష్ అభిమానులు అందరూ కూడా వైరల్ చేస్తున్నారు తమ హీరో ఎంతో సాఫ్ట్ అని మిగతా హీరోలాగా కాదంటూ కాలర్ ఎగరేస్తున్నారు.