ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు రెబల్ స్టార్ ప్రభాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.ఇద్దరు హీరోల లో కూడా ఎన్నో కామన్ క్వాలిటీస్ ఉన్నాయి అని చెప్పాలి.
ఒకవైపు ప్రభాస్ కి మరో వైపు పవన్ కళ్యాణ్ కి తెలుగు చిత్ర పరిశ్రమలో ఊహించని రేంజిలో క్రేజ్ ఉంది.ఎంతోమంది వీరాభిమానులు ఉన్నారు.
ఇక ఇంత స్టార్డం ఉన్నప్పటికీ ఈ ఇద్దరు హీరోలు మాత్రం చాలా తక్కువగా మాట్లాడుతారు.అంతే కాదు ఎంతో సింప్లిసిటీ తో ప్రేక్షకులను ఆకర్షిస్తూ ఉంటారు.
అంతేకాదు సినిమాల్లోని కాంట్రవర్సీల జోలికి అస్సలు పోరు అని చెప్పాలి.
అందుకే ఈ ఇద్దరు హీరోలను అభిమానులు ఎంతో ఇష్టపడుతుంటారు.
హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా హీరోల వ్యక్తిత్వానికి ఫిదా అయిపోతా ఉంటారు అన్న విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు ప్రస్తుతం ఒకే రకం సమస్యతో బాధపడుతున్నారట.
సినిమాల్లో కొనసాగాలంటే తప్పనిసరిగా ఫిట్నెస్ అవసరం.అయితే పాలిటిక్స్ లోకి వెళ్లకముందు పవన్ ఎంతో ఫిట్ గా గ్లామర్ గా ఉండేవాడు.
కానీ రాజకీయాల్లో కి వెళ్ళిన తర్వాత సినిమాలు రాజకీయాలు అంటూ బిజీ అయిపోయి ఫిట్నెస్ పై దృష్టి పెట్టలేకపోతున్నాడు.దీంతో కాస్త ఫిట్ నెస్ తో పాటు గ్లామర్ కూడా తగ్గింది అన్నది టాక్ వినిపిస్తోంది.
ఈ క్రమంలోనే హరిహర వీరమల్లు సినిమా కోసం ఫిట్నెస్ సాధించటానికి బాగానే కష్టపడుతున్నాడట పవన్.ప్రభాస్ పరిస్థితి కూడా ఇలాగే మారిపోయింది.బాహుబలి తర్వాత సాహూ,రాధేశ్యాం సినిమా లో ప్రభాస్ లుక్ అభిమానులను ఎంతగానో నిరాశ పరిచింది.వర్కౌట్ చేయకపోవడం వల్లే ప్రభాస్ లుక్స్ ఇలా దెబ్బతిన్నాయని అభిమానులు చెబుతున్నారు.
ఇక ఇప్పుడు వరుసగా భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్నాడు.దీంతో సమయం లేక వర్కౌట్స్ చేయలేకపోతున్నాడని టాక్ వినిపిస్తోంది.
ఇక మళ్లీ ఒకసారి దృష్టిపెడితే పూర్తిస్థాయి ఫిజిక్ సాధించడం కష్టమేమీ కాదు అంటున్నారు అభిమానులు.