మార్కెట్ లోకి ఒక ప్రొడక్ట్ విడుదలై.మంచి సక్సెస్ సాధిస్తే అలాంటి ఉత్పత్తులే మరికొన్ని కంపెనీలు తయారు చేసి మార్కెట్ లోకి విడుదల చేస్తారు.
సేమ్ సినిమా పరిశ్రమ కూడా ఇలాంటి ఫార్ములానే అనుసరిస్తుంది.ఒక సినిమా విజయం సాధించింది అంటే.
సేమ్ అలాంటి పార్ములాతోనే మరికొన్ని సినిమాలను తెర ముందుకు తీసుకొస్తారు ఫిల్మ్ మేకర్.అలా సేమ్ ఫార్ములాతో వచ్చిన సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.
పటాస్ – టెంపర్
కల్యాణ్ రామ్ హీరోగా వచ్చిన పటాస్… ఆయన సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ తీసిన టెంపర్ మూవీ సేమ్ ఫార్ములాతో వచ్చినవే.పటాస్ సినిమాలో హీరో క్యారెక్టర్ కాస్త నెగెటివ్ రోల్ లో ఉంటుంది.
పోలీస్ ఆఫీసర్ గా అద్భుత నటన చేశాడు కల్యాణ్ రామ్.మొదట్లో నెగెటివ్ షేడ్ నుంచి చివరకు వచ్చే సరికి పాజిటివ్ రోల్ లోకి వస్తాడు.
ఈ సినిమా మంచి విజయం సాధించింది.సేమ్ ఇదే ఫార్ములాతో వచ్చిన సినిమా జూనియర్ ఎన్టీఆర్ టెంపర్.
ఇందులో కూడా తొలుత జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ నెగెటివ్ గా కపిస్తుంది.చివరకు వచ్చే సరికి హీరో పాజిటివ్ మూడ్ లోకి మారిపోతాడు.మొత్తంగా నందమూరి అన్నదమ్ములు ఒకే ఫార్ములాతో వచ్చి సూపర్ డూపర్ హిట్స్ కొట్టారు.
సుకుమారుడు – గ్రీకు వీరుడు

నాగార్జున హీరోగా చేసిన గ్రీకు వీరుడు.యంగ్ హీరో ఆది నటించిన సుకుమారుడు సినిమా కూడా సేమ్ ఫార్ములాతో వచ్చాయి.గ్రీకు వీరుడు సినిమాలో హీరో బడా వ్యాపారవేత్త.
బిజినెస్ కొలాప్స్ అవుతుంది.ఇండియాలో వారసత్వంగా రావాల్సిన ఆస్తుల కోసం వస్తాడు.
ఇక్కడి బంధుల ప్రేమకు బానిసై విదేశాలకు వెళ్లాలనే ఆలోచన మానుకుంటాడు.అయితే ఈ సినిమా విజయం సాధించలేకపోయింది.
సేమ్ ఇదే ఫార్ములతా వచ్చింది ఆది సుకుమారుడు.విదేశాల నుంచి భారత్ లోకి ఓ పల్లెటూరుకు వస్తాడు.
అక్కడ తన అమ్మయ్య ఆస్తిని కొట్టేసేందుకు ఇక్కడికి చేరుకుంటాడు.అయితే ఇక్కడ తన మరదలితో ప్రేమలో పడతారు.
చివరకు ఇక్కడి వారి ఆప్యాయతకు ముగ్ధుడు అవుతాడు.వచ్చిన ఆలోచనను మార్చుకుంటాడు.
సినిమాకు శుభం కార్డు పడుతుంది.అయితే ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది.