తాజాగా టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Icon Star Allu Arjun ) కొత్త సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే.తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో కలిసి సైన్స్ ఫిక్షన్ ఎంటర్ టైనర్ తీయబోతున్నాడు.
అయితే తాజాగా ఈ మేరకు ఒక వీడియోని కూడా విడుదల చేశారు మూవీ మేకర్స్.అయితే ఇదంతా కూడా అందరికీ తెలిసిందే.
అయితే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా 20 ఏళ్ల కుర్రాడిని పరిచయం చేయబోతున్నారు.యూట్యూబ్ లో గత ఏడాది వైరల్ అయిన ఆల్బమ్ సాంగ్స్ లిస్ట్ ( Album Songs List )తీస్తే అందులో కచ్చితంగా కచ్చి సేరా, ఆశా కూడా అనే పాటలు ఉంటాయి.
ఎందుకంటే తలో ఒకటి 200 మిలియన్ వ్యూస్ సాధించాయి.

వీటిని పాడి, ఇందులో కనిపించిన కుర్రాడే సాయి అభయంకర్.ఇతని గురించి సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే వారందరికి తెలిసిందే.అప్పట్లో తెలుగు, తమిళ సినిమాల్లో పాటలు పాడిన సింగర్స్ టిప్పు హరిణిల కొడుకే సాయి.
ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ తో గుర్తింపు తెచ్చుకున్న ఇతడు. అనిరుధ్( Anirudh ) దగ్గర స్పెషల్ ప్రోగ్రామ్ కంపోజర్ గా పని చేశాడు.
గత ఏడాది బెంజ్ అనే తమిళ మూవీలో సంగీత దర్శకుడిగా అవకాశం దక్కించుకున్నాడు.దీంతో పాటు మరో రెండు మూడు ప్రాజెక్టులు కూడా సొంతం చేసుకున్నాడు.
మిగతా సినిమాల సంగతి పక్కన గానీ అల్లు అర్జున్, అట‍్లీ సినిమా( Atlee movie ) కోసం సాయి ఎంపికవడం మాత్రం అందరికీ షాక్ ఇచ్చింది.

ఎందుకంటే పాన్ ఇండియా మూవీ కోసం 20 ఏళ్ల కుర్రాడిని ఎంపిక చేశారంటే విషయం గట్టిగానే ఉందన్నమాట.అనౌన్స్ మెంట్ వీడియోకు ఇచ్చిన మ్యూజిక్ వింటేనే ఈ విషయం అర్థమైపోతుంది.అయితే ప్రస్తుతానికి ఇతడు బన్నీ,అట్లీ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నట్లు అధికారికంగా చెప్పలేదు.
త్వరలో మంచిరోజు చూసి ప్రకటిస్తారేమో చూడాలి మరి.ఒకవేళ ఇదే గనుక నిజం అయితే సాయి కెరిర్ మారి పోవడం ఖాయం.ఈ సినిమా తర్వాత అతనికి వరుసగా అవకాశాలు క్యూ కడతాయి అనడంలో ఎలాంటి సందేహాలు లేవు.