శరీరంలో ఈ పోషకాలు తగ్గాయంటే మీకు డిప్రెషన్ ముప్పు పెరుగుతుంది.. జాగ్రత్త!

నేటి ఆధునిక కాలంలో వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది డిప్రెషన్ బారిన పడుతున్నారు.డిప్రెషన్ అనేది మూడ్ డిజార్డర్.

ఇది నిరంతరం విచారాన్ని కలిగిస్తుంది.ఆలోచన, జ్ఞాపకశక్తి, తినడం మరియు నిద్రపోవడానికి తీవ్ర ఇబ్బంది కలిగిస్తుంది.

ఆసక్తిని కోల్పోయిన అనుభూతిని సృష్టిస్తుంది.ఏకాగ్రతను దెబ్బ తీస్తుంది.

డిప్రెషన్ కారణంగా చాలా మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.డిప్రెషన్( Depression ) లో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకుని త‌నువు చాలిస్తున్న వారి సంఖ్య కూడా అంత‌కంత‌కూ పెరిగిపోతోంది.

Telugu Tips, Latest, Magnesium, Disorder, Vitamin-Telugu Health

అయితే డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు తలెత్తడానికి మన చుట్టూ ఉండే పరిస్థితులే కాదు పౌష్టికాహార లోపం కూడా ఒక కారణం.కొన్ని కొన్ని పోషకాలు మనల్ని శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా బలంగా ఉంచడానికి తోడ్పడతాయి.అటువంటి వాటిల్లో విటమిన్ డి ఒకటి.శరీరంలో కాల్షియం శోషణకు విటమిన్ డి చాలా అవసరం.మెదడు ఆరోగ్యం లో కూడా విటమిన్ డి( Vitamin D ) కీలక పాత్రను పోషిస్తుంది.శరీరంలో విటమిన్ డి తగ్గితే డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు వచ్చే ముప్పు పెరుగుతుంది.

Telugu Tips, Latest, Magnesium, Disorder, Vitamin-Telugu Health

అలాగే రక్తపోటు స్థాయిలను నియంత్రించడానికి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మెగ్నీషియం అవసరమని మనందరికీ తెలుసు.అయితే మన శరీరంలో ప‌లు రకాల బయోకెమికల్ రియాక్షన్స్ జరగడంలో కూడా మెగ్నీషియం చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.మానసిక ఆరోగ్యాన్ని మెగ్నీషియం ప్రభావితం చేస్తుంది.అందువల్ల డిప్రెషన్ వంటి సమస్యలకు దూరంగా ఉండాలంటే మెగ్నీషియం పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.ఇక‌ మెదడు ఆరోగ్యానికి తోడ్పడే పోషకాల్లో ఒమేగా 3 ఫ్యాట్స్( Omega 3 fatty acids ) కూడా ఒకటి.మెదడులో ఎక్కడైనా వాపు ఉంటే దాన్ని తగ్గించడానికి ఒమేగా 3 సహాయపడుతుంది.

అదే సమయంలో డిప్రెషన్ వంటి మానసిక సమస్య నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది.కాబ‌ట్టి ఒమేగా 3 రిచ్ ఫుడ్స్ ను డైట్ లో త‌ప్ప‌క‌ చేర్చుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube