టాలీవుడ్ హీరో కళ్యాణ్ రామ్ (Kalyan Ram)హీరోగా నటించిన తాజా అర్జున్ s/o వైజయంతి(arjun son of vyjayanthi ).ఇందులో స్టార్ హీరోయిన్ విజయశాంతి (Vijayashanti)హీరోగా నటించిన విషయం తెలిసిందే.
కాగా కళ్యాణ్ రామ్ తల్లిగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 18న థియేటర్లలోకి రాబోతోంది.
ఈ సందర్బంగా మూవీ మేకర్స్ ప్రమోషన్స్ లో భాగంగా ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది.2 గంటల 24 నిమిషాల నిడివితో ఫైనల్ కట్ అయిన సినిమాకి సెన్సార్ నుంచి U/A సర్టిఫికెట్ దక్కింది.
కాగా ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోక క్రియేషన్స్ పతాకం పై అశోక్ వర్థన్, సునీల్ బలుసు కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీని డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి తెరకెక్కించారు.
ఇందులో సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సోహైల్ ఖాన్, అర్జున్ రాంపాల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.ఇప్పటికే రిలీజై అయిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
అంతే కాకుండా ఈ సినిమా టీజర్ మూవీపై అంచనాలు పెంచేసాయి.టీజర్ లోనే పవర ఫుల్ పోలీస్ ఆఫీసర్ వైజయంతి పాత్రలో విజయ శాంతి, ఆమె కొడుకు అర్జున్ క్యారెక్టర్‌లో అర్జున్ కనిపించబోతున్నాడని తెలిసిపోయింది.
అన్యాయాన్ని ఎదురించడానికి శత్రువులకు ఎదురుతిరిగే హీరో, చట్ట ప్రకారం అన్నీ సక్రమంగా జరగాలనుకునే తల్లి మధ్య సంఘర్షణగా అర్జున్ s/o వైజయంతి తెరకెక్కినట్టుగా తెలుస్తోంది.

ఎమోషనల్ సీన్స్ తో పాటు యాక్షన్ సీన్స్ అదిరిపోయాయని, సెకండాఫ్ లో ఉత్కంఠ భరితంగా సాగే కథనం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అంటున్నారు.సినిమాని ఎంజాయ్ చేసిన సెన్సార్(censor) సభ్యులు, కళ్యాణ్ రామ్, విజయశాంతిని మెచ్చుకుంటూ, బ్లాక్ బస్టర్ కొట్టారంటూ అభినందించారు.ప్రదీప్ చిలుకూరి, గతంలో నారా రోహిత్, నందమూరి తారక రామ్ (Nara Rohit, Nandamuri Taraka Ram)లతో రాజా చేయి వేస్తే మూవీ చేశాడు.
ఈ మూవీ టేకింగ్, మేకింగ్ విషయంలో విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.

అర్జున్ s/o వైజయంతి మూవీ విషయంలో చాలా కేర్ తీసుకున్న డైరెక్టర్, మదర్ సెంటిమెంట్ తో పక్కా కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించాడని సెన్సార్ రిపోర్ట్ వచ్చింది.కళ్యాణ్ రామ్ విజయ శాంతి మధ్య వచ్చే సీన్స్ చాలా బాగా వచ్చాయని, అలాగే క్లైమాక్స్ లో ట్విస్ట్ తో ప్రేక్షకులు థ్రిల్ అవుతారని అంటున్నారు.అజనీష్ లోక్‌నాథ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అర్జున్ s/o వైజయంతి సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లిందని, యాక్షన్ సీన్స్ అదిరిపోయాయని టాక్.