వర్షాకాలంలో ఆరోగ్యంగా, హుషారుగా ఉండాలంటే.. ఈ పదార్థాలను తినండి..!

వర్షాకాలం( Rainy Season ) అంటే మంకుగా ఉంటుంది.ఆకలి అవ్వదు.

 Eat These Food In Rainy Season To Stay Healthy Details, Rainy Season, Rainy Seas-TeluguStop.com

అలాగే తిన్నది కూడా తొందరగా అరగదు.దీనికి కారణం ఒక్కసారిగా వేడి వాతావరణం నుండి చల్లని వాతావరణంలోకి రావడం.

అంతేకాకుండా వర్షాల వలన జలుబు, దగ్గు, జ్వరంతోపాటు కలుషితమైన నీటి వలన తరచూ విరేచనాలు, వాంతులు కూడా కనిపిస్తాయి.ఇది ప్రతి రైనీ సీజన్లో కూడా సాధారణమే.

అలా అని తినకుండా కూడా ఉండలేము.అలాంటప్పుడు ఏ పదార్థాలను తినాలి? ఏ విధంగా తినాలి? అన్న అవగాహన మనకు ఉండాలి.ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం.వర్షాకాలంలో రోజుకు ఎనిమిది గ్లాసులు మంచినీళ్లు తాగాలి.

Telugu Bacterial, Apples, Ginger Tea, Tips, Healthy, Pomegranate, Rainy Season,

అది కూడా గోరువెచ్చని నీళ్లను( Warm Water ) తాగడం మంచిది.దప్పిక అవడం లేదని నీళ్లను తాగకుండా ఉండకూడదు.ఇక టీ తాగే అలవాటు ఉన్నవారు అల్లం టీ( Ginger Tea ) తాగడం మంచిది.అదేవిధంగా హెర్బల్ టీ తాగడం వలన కూడా ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది.

దీంతో పాటు వేడి వేడి సూప్ కూడా తాగడం మంచిది.ఇలా తాగితే శరీరానికి శక్తి ఇస్తుంది.

అలాగే బద్దకాన్ని తొలగిస్తుంది.ఇక వర్షాకాలంలో దానిమ్మ పండు తింటే చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు.

వీటితో పాటు ఆపిల్స్, బెర్రీ పండ్లు తినడం కూడా మంచిది.ఎందుకంటే వీటిలో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.

Telugu Bacterial, Apples, Ginger Tea, Tips, Healthy, Pomegranate, Rainy Season,

వర్షాకాలంలో విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.ఇక వాతావరణానికి తగ్గట్టుగా ఆహారంలో మార్పులు చేసుకోవాలి.రోజువారి ఆహారంలో వెల్లుల్లి, ఉల్లిపాయలను చేర్చుకోవడం వలన చాలా ప్రయోజనాలు కలుగుతాయి.ఎందుకంటే వీటిలో సహజంగానే యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి.ఇవి ఆరోగ్యానికి ఇన్ఫెక్షన్లు, ఇతర అంటూ వ్యాధులు త్వరగా వ్యాపించకుండా అడ్డుకునేందుకు సహాయపడతాయి.ఇక వాన కాలంలో పెరుగు తీసుకోవడం మంచిది.

ఎందుకంటే అందులో ప్రోబయోటిక్స్ ఉంటాయి.అవి మలబద్ధకం లాంటి సమస్యలను తొలగిస్తాయి.

అలాగే రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా సహాయపడతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube