టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( young tiger ntr )ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలుసిందే.ఇటీవల దేవర సినిమాతో ప్రేక్షకులను పలకరించిన జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో మరో హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్( Prashant Neel ) దర్శకత్వంలో సినిమాలో నటిస్తున్నారు.ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో జూనియర్ ఎన్టీఆర్ పార్టీలకు ఫంక్షన్లకు, ఈవెంట్లకు వరుసగా హాజరవుతున్నారు.
మరి ముఖ్యంగా తనతో పాటు పనిచేసిన డైరెక్టర్లతో తిరుగుతూ బాగానే సందడి చేస్తున్నారు ఎన్టీఆర్.ఈ విషయంలో మిగతా హీరోల కంటే కాస్త ముందు వరుసలో ఉన్నారని చెప్పాలి.
తాజాగా ఎన్టీఆర్ మరో చోట ప్రత్యక్షం అయ్యాడు.

పెద్ద సినిమాల షూటింగులతో ఫుల్ బిజీగా ఉండే ఎన్టీఆర్ బర్త్ డే పార్టీలకు హాజరు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.తాజాగా తనకు బృందావనం లాంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి భార్య బర్త్ డే వేడుకకు సతీసమేతంగా అటెండ్ అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్.ఇదే పార్టీకి బడా డైరెక్టర్లు సుకుమార్ తన భార్య తబితతో రాగా, ప్రశాంత్ నీల్ కూడా వచ్చాడు.
ఈ ముగ్గురూ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమాలు తీసిన, తీస్తున్న వారే.ఇలా బడా డైరెక్టర్లు అందరూ జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి దిగిన ఫొటోను సుకుమార్ భార్య తబిత( Tabitha ) ఇన్ స్టాలో పోస్టు చేయారు.

దీంతో ఈ ఫొటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇలా బడా డైరెక్టర్లు అందరూ ఒకే చోట జూనియర్ ఎన్టీఆర్ తో ఫొటో దిగడాన్ని చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.మొన్నటికి మొన్న ప్రశాంత్ నీల్, ఆయన భార్యను ఎన్టీఆర్ తన ఇంటికి పార్టీకి ఆహ్వానించాడు.వీరంతా కలిసి ఎన్టీఆర్ ఇంట్లో సందడి చేశారు.మొన్న మ్యాడ్ స్వ్కేర్ సక్సెస్ మీట్ కు వెళ్లిన తారక్ ఇప్పుడు బర్త్ డే పార్టీలో ప్రత్యక్షం అయ్యారు.ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాతో పాటు వార్ 2 సినిమాల షూటింగ్ లతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్.
ఈ ఏడాది వార్ 2తో పలకరించబతోతున్నాడు.ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఫోటోపై అభిమానులు నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.