అల్లు అర్జున్ అట్లీ కాంబో మూవీ పోస్టర్ పై అలాంటి విమర్శలు.. కాపీ కొట్టారంటూ?

అల్లు అర్జున్( Allu Arjun ) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ ఇటీవల విడుదల అయిన విషయం తెలిసిందే.అల్లు అర్జున్ అట్లీ( Atlee ) కాంబో మూవీ అప్డేట్ అంచనాలను భారీగా పెంచేసింది.

 Plagiarism Hits Allu Arjun Atlee Project Poster Details, Allu Arjun, Atlee, Allu-TeluguStop.com

అనుకున్న దాని కంటే ఇంకా ఎక్కువగానే ప్రేక్షకులను మెప్పించింది.ఈ ప్రకటన ఏప్రిల్ 8న వచ్చిన మొదలు సోషల్ మీడియాలో ఆ ప్రకటనకు సంబంధించిన వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ఎక్కడ చూసినా కూడా ఇదే విషయం గురించి చర్చించుకుంటున్నారు.పిక్చర్స్ సంస్థ హాలీవుడ్ రేంజ్ లో ఈ మూవీని నిర్మించబోతోందని మంగళ వారం విడుదల చేసిన వీడియోతో అందరికీ అర్థమైంది.

ఇక అల్లు అర్జున్ అభిమానులంతా ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ కు సంబంధించిన స్టిల్స్ ను, వీడియోను చూసి మీసాలు తెగ తిప్పేశారు.

Telugu Allu Arjun, Alluarjun, Atlee, Atleeallu, Atlee Copycat, Dune, Tollywood-M

కానీ ఇదే సమయంలో మూవీకి సంబంధించిన వీడియోకు ఆరు మిలియన్ వ్యూస్ వచ్చాయని ప్రకటిస్తూ సన్ పిక్చర్స్ విడుదల చేసిన పోస్టర్ పై పలువురు విమర్శలు గుప్పించారు.క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అట్లీ మరీ ఇంత దారుణంగా హాలీవుడ్ మూవీ డ్యూన్( Dune ) పోస్టర్ ను ఎత్తేశాడేమిటీ? అని సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.అయితే నిజం చెప్పాలంటే సినిమా వాళ్ళకు క్రియేటివిటీ తక్కువే అని ఇతర సినిమాల నుండి, ఇతరుల కథల నుండి కాపీ కొట్టి అదేదో తమకు తట్టిన ఆలోచన అన్నట్టుగా ప్రచారం చేసుకుంటారని కొందరు విమర్శించారు.2021లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ డ్యూన్ మంచి విజయాన్ని సాధించింది.

Telugu Allu Arjun, Alluarjun, Atlee, Atleeallu, Atlee Copycat, Dune, Tollywood-M

ఆ సినిమా పోస్టర్ ను కలర్ ప్యాట్రన్ తో సహా యథాతథంగా ఎత్తి వేయడాన్ని ఇప్పుడు పలువురు తప్పు పడుతున్నారు.ఇదిలా ఉంటే గతంలోనూ అట్లీ కాపీ క్యాట్ విమర్శలకు లోనయిన విషయం తెలిసిందే.అయితే అందరిలానే అతనూ దానిని సమర్థించుకున్నాడు.

తాను ఎప్పుడూ కాపీకి పాల్పడనని, ఏదైనా సందర్భంలో ఇన్ స్పిరేషన్ పొంది ఉండవచ్చని తెలిపారు.రెండున్నర గంటల పాటు ఉండే సినిమాలో రెండు, మూడు నిమిషాల సన్నివేశాలను ఉదహరిస్తూ కొందరు కాపీ కొట్టినట్టు విమర్శిస్తుంటారని వాపోయాడు.

తనకు ఎంజీఆర్ అంటే ఇష్టమని, ఆయనపై తీసే ఇంట్రడక్షన్ సాంగ్స్ స్ఫూర్తితోనే తానూ తన సినిమాలలో అలాంటి పాటలు పెడుతుంటానని చెప్పాడు.అయితే అట్లీ తెరకెక్కించిన తేరి సినిమా పలు విమర్శలకు కేంద్ర బిందువుగా మారింది.

గతంలో వచ్చిన పోలీస్ స్టోరీస్ లోని అంశాలనే ఇందులోనూ అతను పెట్టేశాడని చాలామంది విమర్శించాడు.వీటినీ అట్లీ ఖండించాడు.

తన ప్రతిభను గుర్తించే షారుఖ్ ఖాన్ వంటి స్టార్ హీరో జవాన్ చిత్రం తీసే ఛాన్స్ ఇచ్చాడన్నది అట్లీ వాదన.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube