1.జగన్ పై లోకేష్ కామెంట్స్
జగన్ మోసపు రెడ్డి బాదుడే బాధుడికి కులం, మతం , ప్రాంతం లేదని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు.
2.ఏపీ హైకోర్టులో ఎంపీ రఘురామ లంచ్ మోషన్ పిటిషన్
ఏపీ హైకోర్టులో ఎంపీ రఘురామకృష్ణంరాజు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.ఈనెల 4 న ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు హాజరయ్యేందుకు తనకు రక్షణ కల్పించాలంటూ రఘురామ పిటిషన్ వేశారు.
3.ఇంద్రకీలాద్రిలో భారీగా ఉద్యోగుల బదిలీలు
విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రిలో భారీగా ఉద్యోగుల బదిలీలు జరుగుతున్నాయి.దుర్గ గుడిలో జూనియర్ అసిస్టెంట్ నుంచి ఏఈవో స్థాయి వరకు 36 మంది బదిలీ అయ్యారు.
4.కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు
కోవిడ్ సమయంలో డాక్టర్లు ప్రజలకు ఎంతో సేవలు అందించారని విజయవాడ టిడిపి ఎంపీ కేసినేని నాని వ్యాఖ్యానించారు ఆ సమయంలో పేదవారికి ఫ్రీ ట్రీట్మెంట్ అడిగాను అని కొంతమంది ప్రైవేట్ డాక్టర్లు కోవిడ్ సమయంలో నా ఫోన్ కూడా ఎత్తలేదని నాని వ్యాఖ్యానించారు.
5.సినిమా టిక్కెట్లు విక్రయాలపై హైకోర్టు స్టే
ఏపీ ప్రభుత్వం ఆన్లైన్ లో మొత్తం సినిమా టికెట్లను వ్యక్రయించాలని జారీ చేసిన జీవో నెంబర్ 69 ని హైకోర్టు నిలిపివేసింది.
6.జగన్ అసెంబ్లీ ని రద్దు చేయాలి జీవిఎల్ సవాల్
ఏపీ సీఎం జగన్ కు బిజెపి ఎంపీ జేబీఎల్ నరసింహారావు సవాల్ విసిరారు.వైసీపీకి రాబోయే ఎన్నికల్లో 175 సీట్లు వస్తాయనే ధైర్యం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని జేబీఎల్ సవాల్ విసిరారు.
7.అచ్చం నాయుడు కామెంట్స్
పార్టీ మారిన నేతలపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్యని టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెం నాయుడు విమర్శించారు.
8.బసవన్న కొండల్లో చిరుత సంచారం
కర్నూలు జిల్లాలోని కోసిగి మండలం కేంద్రంలోని బసవన్న కొండల్లో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది.
9.నేటితో ముగియనున్న అనంతబాబు రిమాండ్
దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడైన వైసిపి ఎమ్మెల్సీ అనంతబాబు రమాండ్ నేటితో పూర్తయినట్లు పోలీసులు తెలిపారు.రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఎస్సీ ఎస్టీ అనంత బాబు ని హాజరుపరచనున్నారు.
10.విష వాయువు లీక్
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాలెం లో గ్యాస్ లీక్ కలకలం రేపింది.ఇమామి ఎడిబుల్ ఆయిల్ ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటుచేసుకుంది. నలుగురు ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు.
11.ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఓటిఎస్
ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు వైయస్సార్ జగన్ అన్న బడుగు వికాసం పథకం కింద భూముల పునరుద్ధరణ కు జీవో నెంబర్ 7 అమలకు ఏఐసిసి శ్రీకారం చుట్టింది.
12.బోనాల ఉత్సవాల నిర్వహణపై సమీక్ష
ఈనెల 24న జరిగే బోనాలు ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
13.నేటి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకంపై నిషేధం
నేటి నుంచి దేశవ్యాప్తంగా సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
14.టెట్ ఫలితాలు విడుదల
తెలంగాణలో టెట్ ఫలితాలు విడుదలయ్యాయి.ఈ ఫలితాలను రాధారెడ్డి విడుదల చేశారు.
15.ఆగస్టు ఒకటి నుంచి రైల్వే స్టేషన్ లలో కొత్త నిబంధనలు
కొత్త నిబంధనలు ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి తీసుకురానుంది.ఆగస్టు ఒకటి నుంచి దేశవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో క్యాటరింగ్ క్యాష్ లెస్ చెల్లింపులు చేయాలని రైల్వే బోర్డ్ నిర్ణయించింది.
16.నుపూర్ శర్మ పై సుప్రీంకోర్టు ఆగ్రహం
మహమ్మద్ ప్రవక్త పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బిజెపి మాజీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.నుపూర్ శర్మ తను చేసిన వ్యాఖ్యలకు వెంటనే మీడియా ముఖంగా క్షమాపణలు దేశానికి చెప్పాలని సుప్రీం ఆదేశించింది.
17.సిపిఎం కార్యాలయం పై బాంబుల దాడి
కేరళలో ఉదృత పరిస్థితులు ఏర్పడ్డాయి.గత రాత్రి అధికార సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యాలయం గుర్తుతెలియని వ్యక్తి పేరడు పదార్థాలను విసరడంతో రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు.
18.భారత్ లో కరోనా
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 17,070 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
19.టీటీడీ ఉచిత వివాహాలకు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
కళ్యాణమస్తు కార్యక్రమానికి నేటి నుంచి ఈనెల 20 వరకు అప్లికేషన్ స్వీకరించనునట్లు టిటిడి అధికారులు తెలిపారు.
20.నేడు హైదరాబాద్ కు రానున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు
బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు హైదరాబాద్ కు రానున్నారు.