ఈ సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు పూర్తయ్యాయ్.దీంతో ఈ ప్రథమార్థంలో ఎవరు ఎక్కువగా ప్రేక్షకులను అలరించారు.ఎవరు హిట్ కొట్టారు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది అని చెప్పాలి.2022 ఫస్టాఫ్ లో ప్రేక్షకులను ఎక్కువగా అలరించింది ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
రాంచరణ్
: ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లో రామ్చరణ్ అందరికంటే ముందు వరుసలో ఉన్నాడు.రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు.
మార్చి 21 తేదీన త్రిబుల్ ఆర్ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ కొట్టింది.ఏప్రిల్ 29వ తేదీన తండ్రితో కలిసి ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.అయితే రెండూ కూడా మల్టీస్టారర్ సినిమాలు కావటం గమనార్హం.
రానా దగ్గుబాటి
: చరణ్ ను వెనక్కి నెట్టి రానా దగ్గుబాటి మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు.జనవరిలో 1945 ఫిబ్రవరిలో భీమ్లా నాయక్ జూన్లో విరాటపర్వం తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఇక ఇందులో భీమ్లా నాయక్ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.
వరుణ్ తేజ్
: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సైతం రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు.గని సినిమా తో వచ్చి నిరాశ పడిన వరుణ్ తేజ్.
ఇటీవలే ఎఫ్ 3 సినిమా తో వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
పూజా హెగ్డే
: పూజా హెగ్డే ప్రథమార్ధంలో ఎక్కువ సినిమాలతో అలరించినప్పటికి నిరాశ మాత్రం తప్పు లేదు అని చెప్పాలి.రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలో నటించింది.ఈ మూడు ఫ్లాప్ గానే మిగిలిపోయాయ్.
ఎఫ్ 3 ఐటం గాళ్ గా కనిపించి ప్రేక్షకులను అలరించాడు.
కీర్తి సురేష్
: కీర్తి సురేష్ కూడా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.గుడ్ లక్ సఖి, చిన్ని, సర్కారు వారి పాట, వాసి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.సర్కారు వారి పాట ఒకటి మంచి విజయాన్ని సాధించింది.
మిల్కీ బ్యూటీ తమన్నా
: గని లో స్పెషల్ సాంగ్ లో కనిపించి మెరిసిన తమన్నా ఆ తర్వాత ఎఫ్ 3 సినిమాలో కథానాయికగా నటించి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
సయి మంజ్రేకర్
: ఉత్తరాది భామ సయి మంజ్రేకర్ ఈ ఏడాది ప్రథమార్థంలో టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.వరుణ్ తేజ్ హీరోగా నటించిన గని సినిమాలో నటించింది.కానీ తర్వాత మేజర్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టింది ఈ ముద్దుగుమ్మ.