చరణ్ మైనపు విగ్రహావిష్కరణకు ముహూర్తం ఫిక్స్... ఎప్పుడంటే? 

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి హీరోల మైనపు విగ్రహాలను ఇప్పటికే మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ( Madame Tussauds Museum ) ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే.అయితే తాజాగా ఈ మ్యూజియంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ( Ram Charan Tej ) మైనపు విగ్రహాన్ని(Wax Statue) కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఇప్పటికే ఈ విగ్రహా తయారీ కూడా పూర్తి అయ్యిందని తెలుస్తోంది .

 Ram Charan Wax Statue At Madame Tussauds Launch On May 9th Details, Madame Tussa-TeluguStop.com
Telugu Madame Tussauds, Peddi, Ram Charan, Ramcharan, Rhym, Wax Statue-Movie

లండన్ లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ తో పాటు తన పెట్ రైమ్( Rhym ) విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు.ఇప్పటికే వీరి కొలతలను కూడా తీసుకోవటం విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది.ఈ మ్యూజియంలో సినిమా, స్పోర్ట్స్‌తో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖుల మైనపు విగ్రహాలు టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఉంటాయి.బాలీవుడ్‌ నుంచి అమితాబ్‌ బచ్చన్‌, రణ్‌బీర్‌ కపూర్‌, ఐశ్వర్యరాయ్‌, షారుక్‌ ఖాన్‌ మైనపు విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి.

Telugu Madame Tussauds, Peddi, Ram Charan, Ramcharan, Rhym, Wax Statue-Movie

ఇక పోతే రామ్ చరణ్ మైనపు విగ్రహావిష్కరణకు కూడా ముహూర్తం ఫిక్స్ చేశారని తెలుస్తుంది.మే 9 వ తేదీ ఈ విగ్రహావిష్కరణ ఉండబోతుందని టుస్సాడ్స్‌ మ్యూజియం వెల్లడించింది.ఈ మైనపు విగ్రహాన్ని లండన్ మ్యూజియంలో లాంచ్ చేసి అనంతరం సింగపూర్ టుస్సాడ్స్ మ్యూజియానికి తరలిస్తారు.ఇక ఈ విషయం తెలియడంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన బుచ్చిబాబు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పెద్ది సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో బిజీ కాబోతున్నారు.

ఈ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube