టాలీవుడ్ టాప్ హీరో మహేష్ బాబు( Mahesh Babu ) తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్( ED ) అధికారులకు లేఖ రాశారు.విచారణకు హాజరు కావాల్సిన నేపథ్యంలో, తనకు షూటింగ్ షెడ్యూల్ ఉండటంతో హాజరుకాలేనని తెలిపారు.
మరో రోజు విచారణకు హాజరయ్యేందుకు సిద్దమని లేఖలో పేర్కొన్నారు.దీనిని ఈడీ అధికారులు కూడా ఆమోదించారు.సాయి సూర్య డెవలపర్స్( Sai Surya Developers ) అనే రియల్ ఎస్టేట్ సంస్థ ప్రమోషన్ కోసం మహేష్ బాబు 5.9 కోట్ల రూపాయలు తీసుకున్నారు.ఇందులో కొంత మొత్తం చెక్కుల రూపంలో, మరికొంత నగదు రూపంలో అందుకున్నారు.ఈ తీసుకున్న డబ్బులకు సంబంధించిన లెక్కలు వివరించాల్సిందిగా ఈడీ అధికారులు మహేష్ బాబుకు నోటీసులు జారీ చేశారు.

హైదరాబాద్ శివారులో ‘సాయి సూర్య డెవలపర్స్’ పేరుతో పెద్ద ఎత్తున వెంచర్లు ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రజల వద్ద కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.సంస్థ యాజమాన్యంలో ఉన్న సతీష్ గుప్త ప్రజలను మోసం చేసినట్టు నిర్ధారణ కావడంతో సైబరాబాద్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.అనంతరం ఈ కేసును ఈడీకి బదిలీ చేశారు.సాయి సూర్య డెవలపర్స్‌తో పాటు సూరానా ఇండస్ట్రీస్ సంస్థ కూడా మోసానికి పాల్పడినట్లు విచారణలో తేలింది.ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు రెండు కంపెనీలపై సోదాలు నిర్వహించారు.ఆ సోదాల్లో మహేష్ బాబు ప్రమోషన్‌కు సంబంధించిన పత్రాలు బయటపడ్డాయి.
దీనిపై స్పష్టత కోరుతూ మహేష్ బాబుకి నోటీసులు పంపారు.

మొత్తానికి ప్రస్తుతం మహేష్ బాబు తన సినిమాల షూటింగ్‌లో బిజీగా ఉన్న నేపథ్యంలో విచారణకు ఆలస్యం అవుతున్నా, త్వరలో ఈడీ ముందు హాజరయ్యే అవకాశం ఉంది.సాయి సూర్య డెవలపర్స్ మోసం కేసు, మహేష్ బాబు ప్రమోషన్ వ్యవహారం ఇంకా విచారణ దశలో ఉంది.