వాస్తు( Vastu ) విషయంలో కచ్చితంగా కొన్ని నియమాలను పాటిస్తూ ఉండాలి.మరి ముఖ్యంగా భారతీయులను వాస్తును విడదీసి చూడని పరిస్థితి ఉంటుంది.
కాబట్టి ఇంటి నిర్మాణం మొదలు ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల విషయం వరకు కూడా ప్రతిదీ వాస్తు ప్రకారం గానే ఉండేలా చూసుకుంటారు.వాస్తు సరిగ్గా లేకపోతే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు.
అయితే ఈ వాస్తు నియమాలు కేవలం సొంతింటికి వర్తిస్తాయని, అద్దె ఇంటికి( Rented Home ) వర్తించవని చాలామంది అనుకుంటారు.కానీ ఇది తప్పు అభిప్రాయం అని పండితులు చెబుతున్నారు.
అద్దె ఇల్లు, సొంతిల్లు అని తేడా లేకుండా వాస్తు ప్రతి ఇంటికి ఖచ్చితంగా పాటించాల్సిందే అని చెబుతున్నారు.

ఇంతకీ అద్దె ఇంటి కోసం వెతికే సమయంలో ఎలాంటి వాస్తు చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.అద్దె ఇంటి కోసం వెతుకుతున్నప్పుడు ఈశాన్యంలో ఖాళీ స్థలం ఉండేలా చూసుకోవాలి.అలాగే ఈశాన్యంలో డోర్ కి ఇంటికి మధ్య ఖాళీ స్థలం ఉండాలి.
ఇల్లు ఏదైనా కచ్చితంగా ఆగ్నేయంలో వంటగది ఉండాలి.ఇంటికి వంటిల్లు( Kitchen ) చాలా ముఖ్యమైనది.
పొరపాటున కూడా వంట గది ఇతర దిశలలో ఉంటే ఆ ఇంట్లోకి అద్దెకు దిగకుండా ఉండడం మంచిది.

అదే ఇంటికి ఎలాంటి పరిస్థితుల్లో నైరుతి దిశలో బాల్కనీ( Balcony ) లేకుండా చూసుకోవాలి.నైరుతిలో బాల్కనీ ఉంటే అది ఇంట్లో ఉండే వారి ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.అలాగే ఇల్లు వీలైనంత వరకు అన్ని దిశల్లో ఒకే రకంగా ఉండేలా చూసుకోవాలి.
ఒక సైడ్ ఎక్కువగా, మరో సైడ్ తక్కువగా ఉండకుండా చూసుకోవాలి.ఇలాంటి పరిస్థితుల్లో కూడా బెడ్ రూమ్( Bed Room ) నైరుతి, దక్షిణ, పశ్చిమం వైపు ఉండేలా చూసుకోవాలి.
అలాకాకుండా వేరే దిశలో ఉంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు.బెడ్ రూమ్ విషయంలో వాస్తు నియమాలు పాటించకపోతే వైవాహిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.