ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా తులసి మొక్క( Basil plant ) కచ్చితంగా ఉండడం ఆనవాయితీగా మారింది.ఇది ఒక పవిత్రమైన మొక్కగా హిందూ సంప్రదాయంలో స్థానాన్ని సంపాదించుకుంది.
అయితే ఆయుర్వేదంలో కూడా ఇది ఒక అద్భుతమైన మూలికగా పనిచేస్తుంది.తులసి మొక్క అనేది సానుకూలతకు, సామరస్యానికి చిహ్నంగా చెబుతారు.
ఇక శాంతియుత వాతావరణాన్ని ఇది కలిగిస్తుందని కూడా అంటారు.ఇక ఇంట్లో తులసి మొక్కను కలిగి ఉంటే ఆ ఇల్లు భోగభాగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లుతుందని పురాణాలు కూడా చెబుతున్నాయి.
తులసి మొక్కను ఒక మతపరమైన చిహ్నంగా చూస్తారు.తులసి మొక్క ఇంట్లో ఉండడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది.

ఇది కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్( Carbon monoxide, sulfur dioxide ) లాంటి హానికర కాలుష్య కారకాలను గ్రహిస్తుంది.అలాగే సహజమైన పద్ధతిలో గాలిని శుద్ధి చేస్తుంది.ఇక నిరంతరం ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచుతుంది.తులసి మొక్కలు ఎక్కువగా ఉన్న చోట ఆక్సిజన్ స్వచ్ఛంగా ఉంటుంది.ఆ ప్రాంతమంతా ఆరోగ్యకరమైన నివాసస్థలంగా చెప్పుకోవచ్చు.వాస్తు ప్రకారం తులసి మొక్కను తూర్పు దిశలో ఉంచడం చాలా ముఖ్యం.
ఈ మొక్కకు తగినంత సూర్యరష్మి చాలా అవసరం ఉంటుంది.అప్పుడే ఈ మొక్క ఆరోగ్యంగా ఉంటుంది.
దక్షిణ దిశలో తులసి మొక్కను అస్సలు ఉంచకూడదు.ఇలా ఉంచడం వలన ప్రతికూల శక్తులు ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది.

అలాగే వైవాహిక జీవితంలో కష్టాలు, అవరోధాలు ఎక్కువగా అవుతాయి.తులసి మొక్కను భక్తితో పూజించాలి.దానికి దగ్గరలో చీపుర్లు, డస్ట్ బిన్లు, చెప్పులు లాంటివి ఉంచకూడదు.అలా ఉంచడం వలన మొక్క పవిత్రను తగ్గించిన వారు అవుతారు.అలాగే తులసి మొక్క ఇంటి పునాది కంటే ఎత్తులో ఉండడం చాలా ముఖ్యం.అయితే తులసి మొక్కలను లెక్క ప్రకారం ఇంట్లో ఉంచుకోవాలి.
ఒక మొక్కను పెంచవచ్చు లేదా మూడు లేదా ఐదు.ఇలా బేసి సంఖ్యలో మాత్రమే తులసి మొక్కలను ఇంట్లో పెంచాలని వాస్తు శాస్త్రం చెబుతోంది.అలాగే ఈ తులసి మొక్కలను ఈశాన్యం వైపు మాత్రమే ఉంచడం మంచిది.