బట్టలుతికిన నీళ్లు కాళ్ల మీద పోస్కుంటే పుట్టింటికి అరిష్టమా?

బట్టలు ఉతికిన నీళ్లు కాళ్ల మీద పోస్కుంటే పుట్టింటికి అరిష్టమనే వార్త నిజమేనని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.ఎందుకంటే మురికి పట్టిన బట్టల నీటిని ఆలోచించకుండా కొందరు ఆడ వాళ్లు కాళ్ల మీద పోస్కుంటారు.

 Is It Unlucky To Be Mother And Father With Laundry Water On Your Feet, Father, M-TeluguStop.com

ఈ విధంగా చేయటం వల్ల పుట్టింటికి అరిష్టమే.ఆడ వాళ్లు ఎక్కువ సమయం నీటిలో ఉంటూ పని చేయడం ద్వారా కాళ్లకూ, చేతులకూ పగుళ్లొస్తాయి.

నూటికి తొంబై మంది మధ్య తరగతి వారిలోనూ, ఆ క్రింద తరగతి స్త్రీలలోనూ ఖచ్చితంగా కాళ్ల పగుళ్లు ఏర్పడతాయి.వారిలో పది శాతం చదువుకున్న, లేదా అందం పట్ల, ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్న వాళ్లు మాత్రమే తగు జాగ్రత్తలు తీసుకుంటారు.

మిగిలిన వారంతా చేతులు, కాళ్ల పగుళ్లను అలాగే వదిలేస్తుంటారు.ఇంట్లోవారి అవసరాల గురించి పట్టించుకునే వాళ్లు… వారి గురించి మాత్రం జాగ్రత్తలు తీసుకోరు.

ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోని స్త్రీలు బట్టలు ఉతికిన నీటిని, మలినమైన నీటిని కాళ్లపై పోసుకోవడం ద్వారా ఎన్నో క్రిములు వారి శరీరంలోకి ప్రవేశించి, అనారోగ్యాన్ని కలుగజేస్తాయి.అప్పుడు అస్వస్థతకు గురైతే భర్త పుట్టింటికి పంపించేస్తాడు.

ఆపై కష్ట పడేది పుట్టింటి వాళ్లే కదా.ఆమె అనారోగ్యం పాలవడం కాకుండా పుట్టింటి వారికి కూడా ఆ అనారోగ్యాన్ని అంటిస్తుంది.

అందువల్లే బట్టలు ఉతికిన మురికి నీటిని కాళ్లపై పోసుకోకూడదని.ఒక వేళ పోస్కుంటే పుట్టింటికి అరిష్టమని చెబుతుంటారు.కూతురు సంతోషంగా ఆరోగ్యంగా, ఆనందంగా పుట్టింటికి వస్తే.ఆనందించాలని ప్రతీ తల్లీ, తండ్రీ కోరుకుంటారు. అదే ఇలా అనారోగ్యంగా వస్తే.ఏ కుటుంబ సభ్యులూ తట్టుకోలేరు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube