Lamps : పూజలో దీపాలు వెలిగించేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఇవే..!

హిందూ ధర్మంలో( Hinduism ) దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని కచ్చితంగా చెప్పవచ్చు.అలాగే మన దేశంలోని చాలా మంది ప్రజలు ఇంటిలో క్రమం తప్పకుండా దీపారాధనను చేస్తూ ఉంటారు.

 These Are The Rules To Be Followed While Lighting The Lamps In The Puja-TeluguStop.com

అలాగే ఏ పూజ కార్యక్రమంలో ఆయన దీపాలు( lamps ) కచ్చితంగా వెలిగిస్తారు.ఈ సంప్రదాయం పురాతన కాలం నుంచి ఉంది.

ఏ పూజ కార్యక్రమం అయినా దీపం వెలిగించడంతో మొదలవుతుంది.దీపం వెలిగించకుండా చేసే పూజలు అసంపూర్ణమని శాస్త్రాలలో ఉంది.

అందుకే పూజా సమయంలో దీపాలు వెలిగించే సంప్రదాయాన్ని చాలా మంది పాటిస్తారు.అయితే దీపాలు వెలిగించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి.

చాలా మంది ప్రజలు ఈ నియమాలను అస్సలు పాటించారు.దీని వల్ల వారు పూజ చేసిన శుభ ఫలితాలను పొందలేరు.

Telugu Bakthi, Devotional, Ghee Lamp, Hinduism, Lamps, Puja-Latest News - Telugu

పూజ చేసిన ఫలితం పూర్తిగా పొందడానికి దీపం వెలిగించేటప్పుడు ఈ నియమాలను కచ్చితంగా పాటించాలి.మరి ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే పూజ సమయంలో వెలిగించే దీపం ఎంతో శుభ్రంగా ఉండాలి.అలాగే పూజలో ఉపయోగించే దీపం ఎక్కడ పగలకుండా ఉండాలి.ఇలాంటి దీపం ఉపయోగించడం అపశకునం అనే పండితులు చెబుతున్నారు.మీరు పూజ ప్రారంభంలో దీపం వెలిగించేటప్పుడు దీపంలో తగిన మోతాదులో నెయ్యి లేదా నూనె ఉండేలా చూసుకోవాలి.

అలాగే పూజా సమయంలో దీపం ఆరిపోకుండా చూసుకోవాలి.

Telugu Bakthi, Devotional, Ghee Lamp, Hinduism, Lamps, Puja-Latest News - Telugu

పూజ మధ్యలో దీపం ఆరిపోవడం అశుభంగా భావిస్తారు.పూజ సమయంలో నెయ్యి దీపం( ghee lamp ) వెలిగించిన వెంటనే మరో నూనె దీపం వెలిగించకూడదు.దీపాన్ని పూజా స్థలంలో మధ్యలో దేవుని విగ్రహం ముందు ఉంచాలి.

నెయ్యి దీపం వెలిగిస్తే ఈ దీపాన్ని మీ ఎడమవైపున ఉంచాలి.మీరు నూనె దీపం వెలిగిస్తే దానిని మీ కుడివైపున ఉంచాలి.

నూనె దీపం లో ఎర్రటి ఒత్తిని ఉపయోగించడం మంచిదని పండితులు చెబుతున్నారు.ఇంటిలో వెలిగించే దీపానికి దూదిని ఉపయోగించి స్వయంగా వత్తులు చేసి వెలిగిస్తే శుభప్రదం అని చాలామంది ప్రజలు భావిస్తారు.

ఎప్పుడూ పడమర దిశలో దీపాన్ని ఉంచకూడదు.ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube