ఈ కార్తీక మాసంలో 15 రోజుల్లో తేడాలోనే రెండు గ్రహణాలు ఏర్పడడం మంచిది కాదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.నవంబర్ 8వ తేదీన చంద్రగ్రహణం మధ్యాహ్నం 2.38 గంటలకు ప్రారంభమై సాయంత్రం నాలుగున్నర గంటల వరకు ఉంటుంది.మధ్యాహ్నం సమయంలో ఆ గ్రహణం ఏర్పడడంతో మనదేశంలో కనిపించే అవకాశం లేకపోయినా పాక్షికంగా కనిపించే అవకాశం ఉంది.
చంద్రగ్రహణం అనర్ధాల గురించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు చెబుతున్నారు.గ్రహణ ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.
మేష రాశి వారికి ఈ గ్రహణం ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.ఈ రాశి వారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు.
అనారోగ్య సమస్యలు వృత్తి వ్యాపారాలు ఉద్యోగాల్లో ఒత్తిడి ఎక్కువ అయిపోయే అవకాశం ఉంది.దీనివల్ల ఈ రాశి వారు అప్రమత్తంగా ఉండకపోతే నష్టాలే తప్పవని వేద పండితులు హెచ్చరిస్తున్నారు.
వృషభ రాశి వారికి కూడా చంద్రగ్రహణం వల్ల ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది.కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఏర్పడతాయి.నిద్రలేమి సమస్య వల్ల అనారోగ్య పారిన పడే అవకాశం ఉంది.వైవాహిక జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి.
వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉంటే ఎలాంటి ప్రమాదాలు రావు.

వృశ్చిక రాశి వారికి కూడా జీవితంలో ఏ పనిలో కూడా విజయం సాధించలేక పోతారు.అనారోగ్య సమస్యలు, వ్యాపారంలో నష్టాలు వంటివి వచ్చే అవకాశం ఉంది.అంతేకాకుండా కొత్త సవాళ్లు వీరిని ఇబ్బందులకు గురిచేస్తాయి.
ఇంకా చెప్పాలంటే జాగ్రత్తగా ఉండకుంటే తుల రాశి వారికి కూడా ఇబ్బందులు తప్పవు.వృత్తి, వ్యాపారాల్లో చిరాకులు, ఉద్యోగాల్లో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
కడుపు, కాళ్లకు సంబంధించిన అనారోగ్యాలు సమస్యల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇంకా కన్యా రాశి వారిలో ఉద్యోగస్తులకు ఎక్కువగా ఒత్తిడి ఉంటుంది.
జాగ్రత్తగా ఉండకుంటే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి.