బాపట్ల జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది.చిన్నగంజాం మండలం మునవారిపాలెంలో యువతి, యువకులు పురుగుల మందు తాగి బలవన్మరణం చెందారు.
మృతులు ఒకే గ్రామానికి చెందిన ఆట్ల సుబ్బారెడ్డి, అక్కల తేజగా గుర్తించారు.దీంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.







