Face Fat Tips : ఫేస్ ఫ్యాట్ తొలగించే ఈజీ టిప్స్.. వయస్సు తగ్గించి చూపించే చిట్కాలు..

ముఖంలో ఎక్కువగా కొవ్వు ఉండడం కొంతమందిని ఎక్కువగా బాధపెడుతుంటుంది.ఎందుకంటే, ఈ కారణంగా ముఖం చాలా లావుగా ఉండి, మిగతా శరీరం చాలా సన్నగా ఉంటే ఇతరులు మీ గురించి కాస్తా హేళన చేస్తారు.

 Effective Tips To Lose Fat In Your Face,face Fat,face Exercises,cardio,fish Face-TeluguStop.com

అంతేకాకుండా, దీని వల్ల మీరు అందవిహీనంగా కనపడతారు.మీ ముఖంలో ఉన్న కొవ్వుని కరిగించడానికి, మీరు కొన్ని ఈజీ టిప్స్ పాటించొచ్చు.

అయితే, ఈ చిట్కాల కోసం మీరు చాలా సమయం కేటాయించాల్సి ఉంటుంది.ఎందుకంటే, బరువు తగ్గే విషయంలో మిగతా శరీర భాగాలతో పోల్చి చూస్తే ముఖంలో ఉండే కండరాలు చాలా సున్నితంగా ఉంటాయి.

మరియు అంత శక్తివంతంగా కూడా ఉండవు.
ఫేస్ ఫ్యాట్‌ని తగ్గించే టిప్స్ పాటిస్తే ముఖాన్ని కచ్చితంగా సన్నగా అవుతుంది.

అందుకోసం 7 ఎఫెక్టివ్ టిప్స్ గురించి తెలుసుకుందాం.

ఫేస్ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల ముఖ రూపాన్ని మెరుగుపడడమే కాకుండా, వృద్ధాప్యాన్ని ఎదుర్కోవటానికి, కండరాల బలం కూడా పెరుగుతుంది.మీ డెయిలీ రొటీన్ లైఫ్‌కి ఈ ఎక్సర్‌సైజెస్‌ని యాడ్ చేయడం వల్ల ముఖ కండరాలను కూడా టోన్ చేయొచ్చని, మీ ముఖం సన్నగా కనబడుతుందని నివేదికలు చెబుతున్నాయి.ఇందులో ఫుల్ ఫేమస్ అయిన ఎక్సర్‌సైజెస్‌ అంటే ఏంటంటే.

మీ బుగ్గలను ఉబ్బినట్టు ఉంచి బయటికి గాలి వదలడం చేస్తుండాలి.చూయింగ్ గమ్‌ తినడం ముఖానికి చక్కని ఎక్సర్‌సైజ్.

దీని వల్ల ముఖంపై ఉండే కొవ్వు కరుగుతుంది.ముఖం అందంగా మారుతుంది.

కాబట్టి పాటించాలి.అయితే, ఎక్కువగా చూయింగ్ తినకూడదు.

అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు.పరిమితి లోపల తింటే మంచిదే.

దీంతో పాటు చేపలలా బుగ్గలను లోపలికి మడిచి నవ్వేందుకు ప్రయత్నించండి.ఫేస్ ఎక్సర్‌సైజెస్ మీ ముఖంలో కండరాల స్థాయిని పెంచుతాయని ఓ నివేదిక పేర్కొంది.

మరో అధ్యయనం ప్రకారం.ఎనిమిది వారాల పాటు రోజుకు రెండుసార్లు ముఖ కండరాల వ్యాయామం చేయడం వల్ల కండరాల మందం పెరుగుతుంది.

కొవ్వు తగ్గడానికి ముఖ వ్యాయామాల ప్రభావంపై పరిశోధనలో లోపం ఉందని గుర్తుంచుకోండి.ఈ వ్యాయామాలు మానవులలో ఫేస్ ఫ్యాట్‌ని ఎలా ప్రభావితం చేస్తాయో అంచనా వేయడానికి మరికొన్ని అధ్యయనాలు అవసరం.మీ ముఖ కండరాలను టోన్ చేయడం ద్వారా, ముఖ వ్యాయామాలు మీ ముఖం సన్నగా కనిపించేలా చేస్తాయి.పరిశోధన పరిమితం అయినప్పటికీ, ముఖ కండరాల వ్యాయామాలు చేయడం వల్ల కండరాల మందం, ముఖం అందంగా కనిపిస్తుందని చెబుతున్నారు.

మీ ముఖంలో అదనపు కొవ్వు ఉందంటే అది శరీరంలో కూడా కొవ్వు ఉన్నట్లు చెబుతారు.బరువు తగ్గడం వల్ల కొవ్వు తగ్గుతుంది.మీ శరీరం, ముఖం రెండింటినీ తగ్గించడానికి సహాయపడుతుంది.కార్డియో, ఏరోబిక్ వ్యాయామం, మీ హృదయ స్పందన రేటును పెంచే ఏ రకమైన శారీరక శ్రమ.

ఇది బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.కొవ్వు కరగడానికి, కొవ్వు తగ్గడానికి కార్డియో సాయపడుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

16 అధ్యయనాల ప్రకారం కార్డియో వ్యాయామంతో కొవ్వు త్వరగా కరిగిపోతుందని నిరూపణ అయింది.ప్రతి వారం 150–300 నిమిషాల శక్తివంతమైన వర్కవుట్స్ చేయడానికి ప్రయత్నించండి.ఇది రోజుకు సుమారు 20–40 నిమిషాల కార్డియోకి మేలు చేస్తుంది.కార్డియో వ్యాయామానికి కొన్ని సాధారణ ఉదాహరణలు ఏంటంటే రన్నింగ్, వాకింగ్, బైకింగ్, ఈత.కార్డియో, ఏరోబిక్ వ్యాయామం, మీ ముఖం సన్నగా మారడానికి, కొవ్వు తగ్గడానికి సాయపడుతుంది.

ఆరోగ్యానికి నీరు చాలా ముఖ్యం.ముఖంలో కొవ్వును తగ్గించుకోవాలంటే నీటిని ఎక్కువ తాగడం మంచి ఆలోచన.నీరు తాగడం వల్ల కడుపునిండినట్లుగా అనిపిస్తుంది.

అదే విధంగా బరువు తగ్గడాన్ని సాయపడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.వాస్తవానికి, ఓ అధ్యయనం ప్రకారం బ్రేక్‌ఫాస్ట్‌తో నీరు తీసుకోవటం త్వరగా బరువు తగ్గినట్లుగా గుర్తించారు.

మరో అధ్యయనం ప్రకారం తాగునీరు జీవక్రియను తాత్కాలికంగా 24 శాతం పెంచింది.రోజులో మీరు బర్న్ చేసే కేలరీల సంఖ్యను పెంచడం ద్వారా బరువు తగ్గడానికి సాయపడుతుందని తేలింది.

దీంతోపాటు, హైడ్రేటెడ్ గా ఉండటం, మీ ముఖంలో ఉబ్బినట్లు ఉండటాన్ని నిరోధిస్తుంది కూడా.త్రాగునీరు కేలరీలను తగ్గిస్తుంది.

ఇది జీవక్రియను పెంచుతుంది.ఇది మీ ముఖంలో ఉబ్బరం, వాపుని కూడా తగ్గిస్తుంది.

Effective Tips to Reduce Face Fat

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube