సమంత ఇటీవల కాలంలో ఎంతగా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత పుష్ప సినిమా లో సమంత ఐటెం సాంగ్ చేసి అందరి చేత శబాష్ అనిపించు కుంది.
ఇక ఆ తర్వాత వరుస సినిమాలు లైన్లో పెట్టింది.మరి అందులో యశోద సినిమా ఒకటి.
ఈ సినిమా మరొక మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సినిమాతో హరి – హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు.
శివలెంక కృష్ణ ప్రసాద్ శ్రీదేవీ మూవీస్ పతాకంపై ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా నిర్మించారు.నవంబర్ 11న రిలీజ్ చేయబోతున్నట్టు చెప్పడంతో ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
అయితే సామ్ గత కొన్నాళ్లుగా మయోసైటీస్ అనే వ్యాధితో పోరాడుతున్నానని సోషల్ మీడియా వేదికగా చెప్పి షాక్ ఇచ్చింది.
ఈ విషయం తెలిసిన తర్వాత సినీ ప్రముఖులు, ఆమె ఫ్యాన్స్ సామ్ త్వరగా ఈ సమస్య నుండి బయట పడాలని కోరుకుంటూ పోస్టులు పెడుతున్నారు.
మరి ఈ నేపథ్యంలో ఈమె ప్రొమోషన్స్ కూడా పాల్గొనదు అని అంతా అనుకున్నారు.కానీ ఈమె మనోధైర్యంతో ముందుకు వచ్చి ప్రొమోషన్స్ లో కూడా పాల్గొంటున్నాను అని నిన్న ప్రకటించారు.
అలా ప్రకటించిందో లేదో ఈ రోజు ఈమె లైవ్ లోకి వచ్చేసింది.సుమ యాంకర్ గా సమంత ఇంటర్వ్యూలో పాల్గొంది.

ఈ వీడియో ఇప్పుడు నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అయ్యింది.సినిమా రిలీజ్ దగ్గర పడడంతో ఈమె ప్రొమోషన్స్ చేయకపోతే సినిమాకు మైనస్ అవుతుంది.అందుకే ఇలాంటి కష్టతరమైన పరిస్థితుల్లో కూడా సామ్ ఇంటర్వ్యూలో పాల్గొంది.అయితే సుమ తన వ్యాధి గురించి అడగడంతో ఈమె ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంది.

ఒకానొక సమయంలో తాను ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేనేమో అని అనిపించింది అని ఇప్పుడు ఇక్కడి వరకు ఎలా వచ్చానా అని అనిపిస్తుంది అని ఎమోషనల్ అయ్యింది.ప్రెజెంట్ బాగున్నానని తెలిపింది.అయితే ఈమెకు ఈ వ్యాధి తాలూకు నీరసం కనిపిస్తుంది.దీంతో ఈమె ఫ్యాన్స్ అంతా త్వరగా సామ్ బ్యాక్ రావాలంటూ కోరుకుంటూ తప్పకుండ యశోద విజయం సాధిస్తుంది అని కామెంట్స్ చేస్తున్నారు.







