ఉత్తరాంధ్ర భద్రాద్రి రామతీర్థం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

ఉత్తరాంధ్రలోని ప్రముఖ క్షేత్రం రామతీర్ధం.విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో ఉంది.

 Do You Know The Rama Theertham Sthala Puranam, Devotional, Ramatheertham, Telugu-TeluguStop.com

రాముడు ఇక్కడ కొంతకాలం.వనవాసం చేశాడని, అప్పుడు శివుడి మంత్రం జపించాడని పురాణాల్లో ఉంది.

అందుకే శివరాత్రితో పాటూ కార్తీకమాసంలోనూ ఎక్కడెక్కడ నుంచో భక్తులు ఇక్కడకు వచ్చి పూజలు చేస్తుంటారని చెబుతారు ఆలయ నిర్వాహకులు.ఈ ఆలయానికి ఉత్తరాన రెండు కిలోమీటర్ల పొడవూ 600 మీటర్లు ఎత్తున్న ఏకశిలా పర్వతం కనిపిస్తుంది.

దీనిపైన సీతారాములు, పాండవులు సంచరించారని చెబుతారు.రామాలయం పక్కనే ఉన్న కోనేరులోని నీరు ఏ కాలంలోనైనా ఇంకిపోవని అంటారు.ఆ నీటి మడుగు నుంచి పశ్చిమం వైపు వెళ్తే భీముని బుర్ర, గాడీ పొయ్యి, బుద్ధ విగ్రహం, పర్ణశాల, పలుకురాయి, పాండవుల పంచలు, సీతమ్మ పురిటి మంచం తాలూకు చిహ్నాలు చూడొచ్చు.

స్థలపురాణం… ద్వాపరయుగంలో పాండవులు వనవాస సమయంలో ఈ ప్రాంతంలో సంచరించారని ప్రతీతి.ఆ సమయంలో కృష్ణుడిని కూడా తమతో రమ్మని పాండవులు కోరితే.సీతారామలక్ష్మణుల విగ్రహాలను వారికి అందజేసి తన బదులుగా పూజించమని చెప్పాడట.ఇక్కడి భీముని గృహం ఉండడం వారు సంచరించరనడానికి ఆనవాళ్లని చరిత్రకారులు చెబుతారు.16వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన పూసపాటి సీతారామచంద్ర మహారాజుకు రాముడు కలలో కనిపించి ద్వాపరయుగంలో పాండవులకు ఇచ్చిన విగ్రహాలు ఇక్కడి బోడికొండపైన ఉన్న నీటి మడుగులో ఉన్నట్లు చెప్పాడట.ఆ రాజు విగ్రహాలను వెలికితీయించి ఆలయం నిర్మించాడట.తీర్థంలో దొరికిన విగ్రహాలు కావడం వల్లే ఈ క్షేత్రానికి రామతీర్ధం అనే పేరు వచ్చిందని, ఇది అతిపురాతనమైన దేవాలయంగానే కాక.మరో భద్రాద్రిగానూ గుర్తింపు పొందిందనీ చరిత్ర చెబుతోంది.1880.ప్రాంతంలో విశాఖపట్నం చరిత్రను రాసిన క్లార్మెరల్ దొర ఈ క్షేత్రం గురించి అందులో ప్రస్తావించడం విశేషం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube