భారత దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో తెలుగు వారు ఎంతో సంబరంగా ఆనందంగా జరుపుకునే పండుగ దీపావళి.దీపావళి అంటేనే కాంతుల మయం.
ఎక్కడ చూసినా దీపాలతో అలంకరణ కరినిస్తుంది…బాణా సంచా పేలుస్తూ ఆనందంగా గడుపుతారు.అయితే దీపావళి వేడుకల్లో పిండి వంటకాలు కూడా ప్రత్యేకం.
తమకు ఇష్టమైన తీపి పదార్థాలు చేసుకొని సంతోషంగా తింటారు.అయితే ఈ ఏడాది దీపావళి హారతులు ఎప్పుడు తీసుకోవాలి అనే సందేహాం చాలామందికి కలిగింది.
నరక చతుర్దశి అభ్యంగన స్నానము, హారతులు తేదీ 6 నవంబర్ 2018 (తెల్లవారితే మంగళవారం అనగా) 6 నవంబర్ 2018 తెల్లవారు ఝామున 4:40 నిమిషాల నుండి ఉదయము 6:10 నిమిషాల వరకు హారతులు తీసుకునుటకు అనుకూలమైన సమయం.సూర్యోదయం తర్వాత హరతులు తీసుకోవాలి అనుకునే వారికి ఉదయం 9:30 నిమిషాల నుండి మధ్యానము 12 గంటల వరకు మధ్యమ ఫలితం ఉంటుంది.
ధనలక్ష్మి పూజలు , కేదార వ్రతము ఎప్పుడు చేసుకోవాలి.?
తేదీ 7 నవంబర్ 2018 బుధవారం అమవాస్యరోజున సాయంత్రము 4 గంటల నుండి రాత్రి 9:31 నిమిషాల వరకు అమావాస్య ఘడియలు ఉన్నాయి.శుభహోరలలో చేయలనుకునేవారికి.సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు గురు హోర శ్రేష్టము.శుక్ర హోరలు:- సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు. బుధ హోరలు:- సాయంత్రం 8 గంటల నుండి 9 గంటల వరకు. చంద్ర హోరలు:- రాత్రి 9 గంటల నుండి 10 గంటల వరకు.
.DEVOTIONAL