తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి9, శనివారం 2024

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.30

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 09 Saturday 2024, Daily Ast-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.25

రాహుకాలం: ఉ.9.00 ల10.30

అమృత ఘడియలు: మ.12.30 ల12.45

దుర్ముహూర్తం: ఉ.6.30 ల7.36

మేషం:

Telugu Astrology, Panchangam, March Saturday, Rasi Phalalu-Telugu Raasi Phalalu

ఈరోజు దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది.చేపట్టిన పనులలో అధిక కష్టంతో అల్పఫలితం పొందుతారు.ఉద్యోగమున అదనపు బాధ్యతలు వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది.కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి.వ్యాపారాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి.

వృషభం:

Telugu Astrology, Panchangam, March Saturday, Rasi Phalalu-Telugu Raasi Phalalu

ఈరోజు గృహమున సంతాన శుభాకార్య విషయమై ప్రస్తావన వస్తుంది.విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది.

చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.వృత్తి ఉద్యోగమున సహోద్యోగులతో సహాయ సహకారాలు అందుతాయి.

మిథునం:

Telugu Astrology, Panchangam, March Saturday, Rasi Phalalu-Telugu Raasi Phalalu

ఈరోజు ఉద్యోగమున పని ఒత్తిడి ఉన్నప్పటికీ పనులు పూర్తి చేసి అధికారుల ప్రశంసలు అందుకుంటారు.వృత్తి వ్యాపారములలో నూతన ప్రణాళికలతో ముందుకు సాగుతారు.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

కర్కాటకం:

Telugu Astrology, Panchangam, March Saturday, Rasi Phalalu-Telugu Raasi Phalalu

ఈరోజు స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.ఆర్థిక పురోగతి కలుగుతుంది.

పాత ఋణాలు తీర్చగలుగుతారు.అప్రయత్నంగా కొన్ని పనులు పూర్తవుతాయి.ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో ఉన్నత పదవులు పొందుతారు.

సింహం:

Telugu Astrology, Panchangam, March Saturday, Rasi Phalalu-Telugu Raasi Phalalu

ఈరోజు ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది.ముఖ్యమైన వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి.వృధా ఖర్చులు పెరుగుతాయి.

ఉద్యోగమున స్థానచలన సూచనలున్నవి.ఆప్తులతో మాట పట్టింపులుంటాయి.నూతన ఋణ ప్రయత్నాలు ఫలించవు.

కన్య:

Telugu Astrology, Panchangam, March Saturday, Rasi Phalalu-Telugu Raasi Phalalu

ఈరోజు నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.సన్నిహితుల నుండి కొన్ని ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి.వృత్తి వ్యాపారమున నూతన ఆలోచనలు అమలు చేస్తారు.

ఆర్థిక పురోగతి కలుగుతుంది.పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

తుల:

Telugu Astrology, Panchangam, March Saturday, Rasi Phalalu-Telugu Raasi Phalalu

ఈరోజు బంధు మిత్రులతో మాటపట్టింపులు పెరుగుతాయి.ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.చేపట్టిన పనులలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి.వృత్తి ఉద్యోగాలు మందకోడిగా సాగుతాయి రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది.దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.

వృశ్చికం:

Telugu Astrology, Panchangam, March Saturday, Rasi Phalalu-Telugu Raasi Phalalu

ఈరోజు వృత్తి ఉద్యోగమున అధికారుల గుర్తింపు పెరుగుతుంది.చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.వ్యాపార విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి.

గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు.ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత నిర్ణయాలు కలసివస్తాయి.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

ధనుస్సు:

Telugu Astrology, Panchangam, March Saturday, Rasi Phalalu-Telugu Raasi Phalalu

ఈరోజు ఆకస్మిక ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది.చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.సన్నిహితుల ప్రవర్తన కొంత ఆశ్చర్య పరుస్తుంది.

మాతృ వర్గ బంధువుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.జీవిత భాగస్వామితో పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

మకరం:

Telugu Astrology, Panchangam, March Saturday, Rasi Phalalu-Telugu Raasi Phalalu

ఈరోజు అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ఉద్యోగమున దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయి.

వృధా ఖర్చులు పెరుగుతాయి.భాగస్వామ్య వ్యాపారాలలో అకారణ వివాదాలు కలుగుతాయి.

కుంభం:

Telugu Astrology, Panchangam, March Saturday, Rasi Phalalu-Telugu Raasi Phalalu

ఈరోజు చేపట్టిన పనులలో ఆటంకాలు తొలగుతాయి.వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు.ఉద్యోగ వాతావరణం ప్రశాంతగా ఉంటుంది.సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు.ఆదాయం పెరుగుతుంది.గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

మీనం:

Telugu Astrology, Panchangam, March Saturday, Rasi Phalalu-Telugu Raasi Phalalu

ఈరోజు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు.సన్నిహితుల సహాయంతో కొన్ని పనులు పూర్తి అవుతాయి.ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.స్ధిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube