ముఖ చర్మం పై ఎటువంటి మచ్చలు( Spots ) లేకుండా తెల్లగా మెరిసిపోతూ కనిపించాలని మగువలు తెగ ఆరాటపడుతూ ఉంటారు.అటువంటి చర్మాన్ని పొందడం కోసం ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు.
ప్రతినెల వాటి కోసం వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.అయినప్పటికీ వాటి వల్ల ఫలితాలు అంతంత మాత్రం గానే ఉంటాయి.
కానీ ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ నైట్ క్రీమ్ ను రెగ్యులర్ గా కనుక వాడితే స్పాట్ లెస్ అండ్ వైట్ స్కిన్ ( Spotless and white skin )మీ సొంతమవ్వడం ఖాయం.మరి ఇంతకీ ఆ నైట్ క్రీమ్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్ ( Coffee powder )వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్( Lemon juice ), వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్( Vitamin E oil ), పావు టీ స్పూన్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ వెజిటబుల్ గ్లిజరిన్( Glycerin ), రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, రెండు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.తద్వారా మన నైట్ క్రీమ్ అనేది రెడీ అవుతుంది.
ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు ముఖానికి మేకప్ ఏమైనా ఉంటే తొలగించి వాటర్ తో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఆపై తయారు చేసుకున్న క్రీమ్ ను ముఖానికి అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.
మరుసటి రోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రెగ్యులర్ గా ఈ నైట్ క్రీమ్ ను వాడటం వల్ల ముఖంపై ఎటువంటి మచ్చలు ఉన్న క్రమంగా తగ్గు ముఖం పడతాయి.
స్పాట్ లెస్ స్కిన్ మీ సొంతం అవుతుంది.అలాగే ఈ క్రీమ్ స్కిన్ టోన్ ను పెంచుతుంది.చర్మం తెల్లగా కాంతివంతంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.కాబట్టి స్పాట్ లెస్ అండ్ వైట్ స్క్రీన్ ను కోరుకునేవారు తప్పకుండా ఈ నైట్ క్రీమ్ ను ప్రయత్నించండి.