"హీరో నాని - ఎస్ ఎస్ థమన్" ల మధ్య ముదురుతోన్న వివాదం ?

సినీ పరిశ్రమలో వివాదాలు ఎక్కువగా వినపడుతుంటాయి.కానీ మ్యూజిక్ డైరెక్టర్ లకు హీరోలకు మధ్య కలహాలు అనేవి చాలా తక్కువనే చెప్పాలి.

 Conflicts Between Hero Nani And Thaman , Thaman , Nani , Music Director , Dir-TeluguStop.com

కాగా ఇపుడు ఇదే తరహాలో ఒక క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ కి మరియు స్టార్ హీరో కి మధ్య వివాదాలు భగ్గు మంటున్నాయి అన్న వార్తలు, ఇండస్ట్రీలో గుప్పుమంటున్నాయి.ఇంతకీ ఈ న్యూస్ ఎవరి గురించి అన్నది ఇప్పటికే మీకో క్లారిటీ వచ్చి ఉంటుంది.

అవునండీ గత కొద్ది రోజులుగా నువ్వా నేనా అన్నట్లుగా అడ్డు పరదా పట్టుకుని మాటలు విసురుకుంటున్న హీరో నాని మరియు సంగీత దర్శకుడు తమన్ అనే అంటున్నారు.తాజాగా వీరి గురించి మరో వార్త సంచలనంగా మారింది.

వీరిద్దరి మధ్య చిన్నగా మొదలయిన మనస్పర్థలే ఇపుడు పెద్ద పరిశ్రమలో వివాదం అయి దుమారం రేపుతున్నాయి అంటున్నారు.

తాజాగా నాని లేటెస్ట్ ప్రాజెక్ట్ తారాగణాన్ని సమకూర్చుకుంటున్న నేపథ్యంలో ఆ సినిమాకి సంగీతం కోసం తమన్ వద్దకు వెళ్ళి మా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా చేయమని డేట్స్ కోసం వెళ్లారట దర్శక నిర్మాతలు.

అయితే అది విన్న తమన్ నాని చిత్రానికి నేను చెయ్యను ఏమీ అనుకోకండి అని నిర్మొహమాటంగా చెప్పేశాడట.ఆ తరవాత విషయం తెలుసుకున్న హీరో నాని నన్ను అడగకుండా థమన్ ని ఎందుకు సంప్రదించారు అంటూ టీం పై ఫైర్ అయినట్లు సమాచారం.

కాగా ఇలా వీరిద్దరి మధ్య నలిగిపోతున్నారట దర్శక నిర్మాతలు. అలా వైకుంఠ పురం చిత్రం తర్వాత థమన్ కెరియర్ గ్రాఫ్ అలా పెరిగిపోయింది.ఈ సినిమా కమర్షియల్ గా మరియు మ్యూజిక్ పరంగాను సెన్సేషనల్ క్రియేట్ చేయడంతో థమన్ కు బ్రేక్ అందింది.

Telugu Gopi Sundar, Music, Music Dsp, Nani, Producers, Shyam Singaray, Thaman, T

ఇక అప్పటి నుండి వరుస చిత్రాలతో ఫుల్ బిజీ అయిపోయారు.స్టార్ హీరోలు సైతం పిలిచి మరి థమన్ కి అవకాశాలు ఇస్తున్నారు.టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పీ కి గట్టి పోటీ ఇస్తున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో వీరిద్దరి మ్యూజిక్ ట్రెండ్ బలంగా నడుస్తోందనే చెప్పాలి.అయితే నాని నటించిన టక్ జగదీష్ మూవీ కరోనా కారణంగా ఓ టి టి లో రిలీజ్ అయి మిశ్రమ స్పందన తెచ్చుకున్న విషయం తెలిసిందే.

కాగా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ముందుగా థమన్ ని ఎంపిక చేసుకున్నారు.కొన్ని ట్యూన్స్ కూడా చేయించారు అయితే అవి హీరో నానికి నచ్చలేదు… మళ్ళీ వేరే ట్యూన్స్ అడగటంతో మళ్ళీ కొన్ని ట్యూన్స్ ను ఇచ్చారు థమన్.

కానీ అవి కూడా నానికి నచ్చకపోవడంతో దర్శక నిర్మాతలతో మాట్లాడి థమన్ ని తమ సినిమా నుండి తప్పించి ఆ ప్లేస్ లో తనకి తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ ని సెలెక్ట్ చేశారు నాని.

Telugu Gopi Sundar, Music, Music Dsp, Nani, Producers, Shyam Singaray, Thaman, T

అయితే అప్పట్లో థమన్ ఈ విషయాన్ని లైట్ తీసుకున్నారు.అందరికీ అన్నీ నచ్చాలని లేదు అనుకుని సరిపెట్టుకున్నారు.అయితే ఆ తరవాత ఇటీవల నాని చిత్రం శ్యామ్ సింగరాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో హీరో నాని పేరు చెప్పకనే ఒకరిపై సెటైర్లు వేశారు.

అయితే ఆయన ఇండైరెక్ట్ గా థమన్ పై కామెంట్స్ చేసారు అన్నది అందరి నుండి వినిపిస్తున్న మాట.కాగా అది నిజమే అన్నట్లుగా ఆ తరవాత ట్విట్టర్ లో స్పందిస్తూ నాని పై పరోక్షంగా విమర్శలు విసిరారు.అలా వీరి మద్య కోల్డ్ వార్ జరుగుతోందని ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube