సినిమా అంటే హీరోనే టాప్.సినిమా మొదటి నుంచి చివరి వరకు తనే హైలెట్ అవుతాడు.కానీ ప్రస్తుతం సినిమాల్లో పరిస్థితి మారింది.హీరోకి ఏమాత్రం తీసిపోకుండా విలన్ పాత్రలు క్రియేట్ చేస్తున్నారు ఫిల్మ్ మేకర్స్.హీరోతో పోల్చితే విలన్ కే ఎక్కువ క్రేజ్ వచ్చేలా వారి క్యారెక్టర్లను తయారు చేస్తున్నారు.అందుకే విలన్ పాత్రల్లో నటించేందుకు ప్రస్తుతం స్టార్ హీరోలు సైతం ముందుకు వస్తున్నారు.
హీరోలకు మంచిన స్థాయిలో మంచి గుర్తింపు పొందుతున్నారు.ఒకప్పటి టాప్ హీరో జగపతి బాబు ప్రస్తుతం విలన్ పాత్రలు చేస్తూ మస్త్ క్రేజ్ సంపాదిస్తున్నాడు.
ఆయన హీరో కంటే విలన్ పాత్రల్లోనే బాగా నటిస్తున్నాడనే టాక్ సర్వత్రా వినిపిస్తుంది.ఇంతకీ హీరోలను మించి పేరు తెచ్చిన విలన్ పాత్రల్లో నటించిన స్టార్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
*విజయ్ హీరోగా మాస్టర్ సినిమా తెరకెక్కింది.ఇందులో విలన్ పాత్రలో విజయ్ సేతుపతి నటించాడు.హీరోకు మించిన క్రేజ్ కొట్టేశాడు విజయ్ సేతుపతి.

*మహేష్ బాబు హీరోగా వచ్చిన స్పైడర్ సినిమా లో సూర్య విలన్ గా నటించి వారెవ్వా అనిపించాడు.

*రామ్ చరణ్ హీరోగా వచ్చిన దృవ సినిమా వచ్చింది.ఇందులో అరవింద స్వామి విలన్ గా నటించి మెప్పించాడు.

*నాని హీరోగా గ్యాంగ్ లీడర్ సినిమా తెరకెక్కింది.కార్తికేయ విలన్ గా నటించి మంచి క్రేజ్ కొట్టేశాడు.

*విశాల్ హీరోగా వచ్చిన అభిమన్యుడు సినిమా లో అర్జున్ విలన్ గా నటించి అదరగొట్టాడు.

*ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి సినిమాలో రానా విలన్ గా నటించి ఆకట్టుకున్నాడు.

*మహేష్ బాబు హీరోగా నటించిన నిజం సినిమా లో గోపీచంద్ విలన్ గా యాక్ట్ చేసి సూపర్ అనిపించాడు.

*నాగచైతన్య హీరోగా వచ్చిన యుద్ధం శరణం సినిమా లో శ్రీకాంత్ విలన్ రోల్ పోషించాడు.

*మహేష్ బాబు హీరోగా వచ్చిన అతిధి సినిమాలో మురళి శర్మ విలన్ గా నటించి అద్భుతం అనిపించాడు.

*నితిన్ హీరోగా వచ్చిన జయం సినిమాలో గోపీచంద్ విలన్ గా యాక్ట్ చేసి.తన అద్భుతన నటనతో వారెవ్వా అనేలా చేశాడు.