అమెరికాలో మరో కొత్త వైరస్.. 20 ఏళ్ల తర్వాత వెలుగులోకి ‘‘ మంకీపాక్స్ ’’ , టెక్సాస్‌లో తొలి కేసు

ఇప్పటికే వివిధ రకాల స్ట్రెయిన్లు పుట్టుకొస్తూ కరోనా కలవరపెడుతున్న వేళ అమెరికాలో మరో వైరస్‌ కలకలం రేపింది.

దాదాపు 20 సంవత్సరాల తర్వాత తొలిసారి మంకీపాక్స్‌ వైరస్‌ కేసు వెలుగుచూసింది.

టెక్సాస్‌కు చెందిన ఒక వ్యక్తిలో ఈ వైరస్‌ను గుర్తించినట్లు యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకటించింది.కొన్ని రోజుల కిందట నైజీరియా నుంచి వచ్చిన ఆ వ్యక్తికి అక్కడ మంకీపాక్స్‌ వైరస్‌ సోకి ఉండవచ్చని అభిప్రాయపడింది.

ఆ వ్యక్తిని ప్రస్తుతం డల్లాస్‌లోని ఆసుపత్రిలో ఐసొలేషన్‌లో ఉంచినట్లు వివరించింది.ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.

ఈ వైరస్‌కి కూడా త్వరగా వ్యాపించే లక్షణం వున్నందున మరింత మందికి ఇది సోకకుండా నష్ట నివారణా చర్యలు చేపట్టారు.దీనిలో భాగం ఈ నెల 8,9 తేదీల్లో బాధితుడు ప్రయాణించిన రెండు విమానాల్లో అతడితో కలిసి ఉన్న ఇతర ప్రయాణికులను ట్రేస్‌ చేసి వారికి పరీక్షలు నిర్వహించేందుకు ఎయిర్‌లైన్స్‌, స్థానిక ఆరోగ్య సంస్థలతో కలిసి ప్రయత్నిస్తున్నట్లు సీడీసీ వెల్లడించింది.2003లో అమెరికాను మంకీపాక్స్ వణికించింది.దాదాపు 47 మందికి ఈ వైరస్ సోకింది.

మంకీపాక్స్ అంటే?

Advertisement

మంకీపాక్స్ వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది.సాధారణంగా మధ్య, పశ్చిమ ఆఫ్రికాల్లో ఈ వైరస్ వ్యాపించే అవకాశాలు ఎక్కువ.ఇదికూడా కరోనా తరహాలోనే ఒకరి నుంచి మరొకరికి తుంపర్ల ద్వారా సోకుతుంది.

వ్యాధి సోకిన వారిని తాకినా.మంకీపాక్స్ వ్యాపించే అవకాశం ఉంది.

ఇది శరీరంలోకి పూర్తిగా విస్తరించడానికి 6 నుంచి 13 రోజులు పడుతుంది.ఒక్కోసారి 5 నుంచి 21 రోజుల సమయం కూడా పడుతుందని నిపుణులు వెల్లడించారు.

మంకీపాక్స్ లక్షణాలు:

జ్వరం, తలనొప్పి, వాపులు, నడుంనొప్పి, కండరాల నొప్పి, అలసట మంకీపాక్స్ లక్షణాలు.జ్వరం వచ్చే సమయంలో చర్మంపైన దద్దుర్లు, బొబ్బర్లు కూడా ఏర్పడే అవకాశం ఉంది.ఇవి సాధారణంగా అరిచేతులు, అరిపాదాల్లో వస్తుంటాయి.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

దీని ద్వారా విపరీతమైన దురద లేదా నొప్పి కలుగుతాయి.ఒక్కోసారి మచ్చలు కూడా ఏర్పడవచ్చు.

Advertisement

ఈ లక్షణాలు 14 నుంచి 21 రోజుల్లో బాధితుడిలో బయటపడతాయి.ఇలాంటి సందర్భాల్లో ఓ వ్యక్తి నుంచి మరోవ్యక్తికి వ్యాప్తికి అవకాశాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఈ వ్యాధిని అంతం చేయడానికి ఖచ్చితమైన చికిత్స లేదని సీడీసీ వెల్లడించింది.అయితే స్మాల్పాక్స్ వ్యాక్సిన్, యాంటీవైరల్స్ వంటి ఔషధాలు వాడొచ్చని సూచించింది.

తాజా వార్తలు