వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

జనసేన పార్టీ ( Janasena party ) ఎన్నికల గుర్తుగా ఉన్న గాజు గ్లాస్ గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడంపై జనసేన పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్త చేస్తోంది.జనసేన పార్టీ 21 అసెంబ్లీ, రెండు లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తుంది.

 They Are The Janasena Who Have Been Courted By The Glass Mark, Janasena Prty, J-TeluguStop.com

ఈ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించగా , జనసేన పోటీలో లేని నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడం పై జనసేనతో పొత్తు పెట్టుకున్న టీడీపీ, బీజేపీలు( TDP , BJP) తీవ్ర ఆందోళనలో ఉన్నాయి.జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఆ పార్టీ పోటీ చేయకపోయినా, ఆ పార్టీ గుర్తుతో ఇతరులు పోటీ చేస్తే తమకు పడాల్సిన ఓట్లలో చీలిక ఏర్పడుతుందనే ఆందోళన వారిలో కనిపించింది.

గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్స్ జాబితాలో ఎన్నికల సంఘం పెట్టడంతోనే ఇదంతా జరిగింది.

Telugu Aliance, Janasena Prty, Janasenasymbol, Janasenani, Janasenaglass-Politic

ఈ నేపథ్యంలో గాజు గ్లాస్ గుర్తును ఇతరులకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ.ఏపీ హైకోర్టులో ( AP High Court )జనసేన పిటిషన్ దాఖలు చేసింది ఈ పిటిషన్ ను స్వీకరించిన కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.దీంతోపాటు స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ కేటాయించడం పై అభ్యంతర వ్యక్తం చేస్తూ జనసేన పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిం.

ది దీనిపై 24 గంటల్లో తగిన నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల సంఘం ప్రకటించింది .దీంతో ఎన్నికల సంఘం తీర్పు అనుకూలంగా వస్తే సరే.లేదంటే దీనిపై ఏ విధంగా ముందుకు వెళ్లాలనే విషయం పైన టిడిపి, ,జనసేన ,బీజేపీలు చర్చించుకుంటున్నాయి.

Telugu Aliance, Janasena Prty, Janasenasymbol, Janasenani, Janasenaglass-Politic

ఇప్పటికే జనసేన టికెట్ దక్కక అసంతృప్తి గురైన వారు రెబెల్ అభ్యర్థులుగా చాలా చోట్ల పోటీ చేస్తున్నారు.వారిలో చాలామందికి గాజు గ్లాస్ గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది.అలాగే టిడిపి టికెట్ దక్కక రెబల్ గా పోటీ చేస్తున్న వారిలో చాలామందికి గాజు గ్లాస్ గుర్తు దక్కడం వంటివి కూటమి పార్టీల్లో గందరగోళానికి కారణం అయ్యాయి.

ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం తో పాటు ,హైకోర్టులోను జనసేన పిటిషన్ దాఖలు చేసింది

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube