మరో నెల రోజుల వరకు పెద్ద సినిమాలేవీ థియేటర్లలో విడుదల కావడం లేదనే సంగతి తెలిసిందే.ప్రస్తుతం చిన్న సినిమాలపై మాత్రమే అందరి దృష్టి ఉంది.
ఈ వారం థియేటర్లలో రిలీజ్ కానున్న క్రేజీ సినిమాలలో రాజు యాదవ్( Raju Yadav ) ఒకటి.గెటప్ శ్రీను ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాపై ఒక వర్గం ప్రేక్షకుల్లో బాగానే అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ సినిమాలో వినోదానికి పెద్ద పీట వేశారని సమాచారం అందుతోంది.ఈ నెల 24న ఈ సినిమా రిలీజ్ కానుంది.
ఈ సినిమాకు కృష్ణమాచారి.కె.దర్శకత్వం వహించారు.అశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటించిన లవ్ మీ మూవీ( Love Me Movie ) ఈ నెల 25వ తేదీన థియేటర్లలో విడుదల కానుందని తెలుస్తోంది.
కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.హీరో దెయ్యాన్ని లవ్ చేయడమనే వింత కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.ఈ నెల 24వ తేదీన డర్టీ ఫెలో( Dirty Fellow Movie ) అనే చిన్న సినిమా కూడా థియేటర్లలో రిలీజ్ కానుంది.

యాక్షన్, అడ్వెంచర్ సినిమాలను టార్గెట్ చేస్తూ ఈ నెల 23న ప్యూరియోసా : ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా( Furiosa A Mad Max Saga ) విడుదల కానుందని సమాచారం.తెలుగులో కూడా ఈ సినిమా రిలీజ్ కానుంది.నెట్ ఫ్లిక్స్ లో ఈ వారం టఫెస్ట్ ఫోర్సెస్ ఆన్ ది ఎర్త్( Toughest Forces on Earth ) అనే డాక్యుమెంటరీ సిరీస్ ఈ నెల 22న స్ట్రీమింగ్ కానుండగా అట్లాస్( Atlas ) హాలీవుడ్ మే నెల 24న స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.
మే 24న నెట్ ఫ్లిక్స్ లో క్రూ( Crew ) అనే మరో హిందీ మూవీ స్ట్రీమింగ్ అవుతున్నట్టు భోగట్టా.

అమెజాన్ ప్రైమ్ లో మే నెల 23వ తేదీన ద టెస్ట్ 3 వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుండగా ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.జీ5 ఓటీటీలో వీర్ సావర్కర్( Veer Savarkar ) ఈ నెల 24వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుందని భోగట్టా.హాట్ స్టార్ లో ఈ నెల 23న ది కర్దాషియన్స్( The Kardashians ) స్ట్రీమింగ్ కానుండగా ఈ నెల 24న ద బీచ్ బాయ్స్ అనే డాక్యుమెంటరీ మూవీ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.
జియో సినిమాలో ఈ నెల 21 నుంచి అక్వామెన్( Aquaman ) తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ కానుండగా అదే తేదీన డ్యూన్ 2 హాలీవుడ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్ కానుంది.
యాపిల్ టీవీ ప్లస్ లో మే 22న ట్రెయింగ్ 4 వెబ్ సిరీస్, లయన్స్ గేట్ ప్లే, మే24న వాంటెడ్ మాన్ హాలీవుడ్ స్ట్రీమింగ్ కానుంది.
ఈ వారం ఓటీటీలో విడుదల కానున్న సినిమాలు ఇవే ( Telugu OTT Movies Week Release List )
Movie Name | Release Date | Online Streaming Partner |
---|---|---|
ప్యూరియోసా : ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా | మే 23 | నెట్ఫ్లిక్స్ |
టఫెస్ట్ ఫోర్సెస్ ఆన్ ది ఎర్త్ | మే 22 | నెట్ఫ్లిక్స్ |
అట్లాస్ | మే 24 | నెట్ఫ్లిక్స్ |
ద టెస్ట్ 3 | మే 23 | అమెజాన్ ప్రైమ్ |
వీర్ సావర్కర్ | మే 24 | జీ5 |
ది కర్దాషియన్స్ | మే 23 | హాట్ స్టార్ |
ద బీచ్ బాయ్స్ | మే 24 | హాట్ స్టార్ |
అక్వామెన్ | మే 21 | జియో సినిమా |
డ్యూన్ 2 | మే 21 | జియో సినిమా |
ట్రెయింగ్ 4 | మే 22 | యాపిల్ టీవీ ప్లస్ |
లయన్స్ గేట్ ప్లే | మే 22 | యాపిల్ టీవీ ప్లస్ |
వాంటెడ్ మాన్ హాలీవుడ్ | మే 24 | యాపిల్ టీవీ ప్లస్ |