వైరల్ వీడియో: అమ్మాయిని కాటేసిన పాము.. ఏకంగా పామును ఆసుపత్రికి తీసుకెళ్ళిన కుటుంబ సభ్యులు..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రతిరోజు వివిధ రకాలకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ గా మారడం చూసే ఉంటాం.ముఖ్యంగా చాలాసార్లు జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ గా మారుతూ ఉంటాయి.

 Family Members Took The Snake To The Hospital That Bite The Girl Viral Video Det-TeluguStop.com

ఈ నేపథ్యంలో తాజాగా ఓ పాము( Snake ) బాలికను కాటు వేసింది.పాముకాటుకు భరించలేని బాలిక గట్టిగా ఏడవడంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు బాలికను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అయితే ఈ సమయంలో ఆ పాపకి కాటేసిన పామును కూడా కుటుంబ సభ్యులు పట్టుకొని దానిని కూడా ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఇక ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.

బీహార్ లోని( Bihar ) చందేయ్ తానా జిల్లాలోని దులాత్‌పూర్ గ్రామానికి చెందిన ఓ బాలిక( Girl ) తన ఇంటి సమీపంలో ఉన్న ఓ చెట్టుకు పువ్వులను తెంపుతుండగా పాము కాటేసింది.ఈ నేపథ్యంలో బాలికను జిల్లా ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు దాంతో పాప పరిస్థితి విషమంగా మారడంతో తర్వాత మెరుగైన చికిత్స కోసం షరీఫ్ సదార్ హాస్పిటల్‌కు( Sharif Sadar Hospital ) తరలించారు.ఈ నేపథ్యంలో ఏ పాము కరిచిందో తెలపడానికి పామును కూడా ఆసుపత్రికి( Hospital ) తీసుకెళ్లగా.

అక్కడ ఉన్న వైద్యులు, అలాగే రోగులు ఒకంత షాక్ గురయ్యారు.అయితే ఓ ప్లాస్టిక్ డబ్బాలో పామును ఉంచి తీసుకురావడంతో అక్కడ ఉన్న రోగులు కాస్త భయనికి గురై., కొందరైతే పరుగులు కూడా పెట్టారు.ఇక చివరిగా ఆ పామును అటవీ శాఖ అధికారులకు అప్పగించారు కుటుంబీకులు.ఇలా ఎందుకు చేశారన్న ప్రశ్నకు కుటుంబ సభ్యులు అయితే.ఏ పాము కాటు వేసిందో తెలిస్తే.

, దానికి తగ్గ వైద్యం అందిస్తారన్న ఉద్దేశంతో కుటుంబ సభ్యులు ఆ పామును బంధించి తీసుకొచ్చినట్లు అధికారులతో తెలిపారు.ఇకపోతే ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube