1.మరోసారి ఈడి విచారణకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే

టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మరోసారి ఈడి అధికారుల విచారణకు హాజరయ్యారు.నిన్న తొమ్మిది గంటల పాటు ఈడి అధికారులు ఆయనను విచారించిన సంగతి తెలిసిందే.
2.తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నియామకం
తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు.
3.మహేష్ బాబు తల్లి మృతిపై పలువురు సంతాపం

సినీ హీరో మహేష్ బాబు తల్లి ఇందిర మృతిపై పలువురు సినీ రాజకీయ ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు.
4.విశాఖ రైల్వే జోన్ పై క్లారిటీ ఇచ్చిన జీవీఎల్
విశాఖ రైల్వే జోన్ పై బిజెపి ఎంపీ జివీఎల్ నరసింహారావు క్లారిటీ ఇచ్చారు.విశాఖ రైల్వే జోన్ ఉండదని కేంద్రం చెప్పిందనే ప్రచారం వట్టి అబద్ధమని, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు బిల్డింగ్ నిర్మాణానికి కేంద్రం చర్యలు ప్రారంభించిందని జివీఎల్ చెప్పుకొచ్చారు.
5.విశాఖకు రైల్వేజోన్ రాకపోతే రాజీనామా చేస్తా

విశాఖకు రైల్వే జోన్ రాకపోతే తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని వైసిపి రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి అన్నారు.
4.జగన్ పై సిపిఐ కామెంట్స్
ఏపీకి కేంద్రం పదేపదే ద్రోహం చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి పట్టదా అంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు.
5.నేడు గాయత్రీ దేవిగా కనకదుర్గమ్మ అమ్మవారు

ఏపీలోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.నేడు మూడో రోజు ఇంద్రకీలాద్రి కొండపై అమ్మవారు గాయత్రీ దేవిగా దర్శనం ఇవ్వనున్నారు.
6.రాహుల్ గాంధీ జోడో యాత్ర
కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత జోడోయాత్ర నేడు 21వ రోజు కొనసాగుతోంది.
7.జగన్ పర్యటన

ఏపీ సీఎం జగన్ నేడు నంద్యాలలో పర్యటించారు.ఈ సందర్భంగా రాంకో సిమెంట్ పరిశ్రమను జగన్ ప్రారంభించారు.
8.చింతపల్లి కేంద్రంగా ఫారెస్ట్ డివిజన్ ప్రారంభం
అల్లూరి సీతారామరాజు జిల్లా లోని చింతపల్లి కేంద్రంగా ఫారెస్ట్ డివిజన్ సేవలు ప్రారంభం ఉన్నాయి.
9.అమరావతి మహా పాదయాత్ర

అమరావతి టు అరసవెల్లి రైతుల మహా పాదయాత్రలో భాగంగా నేడు ఏలూరు జిల్లాలోని వంగాయగూడెం సెంటర్ నుంచి యాత్ర ప్రారంభమైంది.
10.తిరుమల సమాచారం
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు రెండో రోజు సందర్భంగా రాత్రి ,7 గంటలకు హంస వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
11.శ్రీశైలంలో దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు

నేడు శ్రీశైలంలో మూడో రోజు దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి.సాయంత్రం సందర్భంగా అలంకారంలో శ్రీ భ్రమరాంబిక దేవి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
12.షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర
సంగారెడ్డి జిల్లాలో వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ముగిసింది మెదక్ జిల్లాలోకి యాత్ర ప్రవేశించింది.
13.బతుకమ్మ ఆడిన కేఏ పాల్

తెలంగాణలో బతుకమ్మ పండుగ సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి.ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా బతుకమ్మ ఆడి అందరిని ఉత్సాహపరిచారు.మునుగోడులో పర్యటించిన సందర్భంగా అక్కడ బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు.
14. నయీమ్ అనుచరుడు అరెస్ట్
మాజీ నక్సలైట్ గ్యాంగ్ స్టర్ నయీం ఆనుచరుడు మద్దునూరి శేషయ్య అలియాస్ శేషన్న ను అరెస్ట్ ను అధికారికంగా వెస్ట్ జోన్ డిసిపి జోయల్ ప్రకటించారు.
15.హెచ్ సి ఏ పై మరో కేసు నమోదు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై మరో కేసు నమోదు అయింది.మ్యాచ్ టికెట్లు విక్రయం తోకిస్తున్నట్లు భాగంగా హెచ్ సి ఐ పై ఇప్పటికే మూడు కేసులు నమోదైన విషయం తెలిసిందే.
16.సికింద్రాబాద్ మధ్య వీక్లీ ప్రత్యేక రైళ్లు
విశాఖపట్నం సికింద్రాబాద్ వీక్లీ ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
17.ఆలిండియా ఓపెన్ చెస్ టోర్నీ
ఈనెల 30 నుంచి వచ్చిన నాలుగో తేదీ వరకు సఫిల్ గూడాలోని బిజెపి పబ్లిక్ స్కూల్ లో హైదరాబాద్ ఆల్ ఇండియా ఓపెన్ ఫీడ్ రేటింగ్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నారు.
18.కామారెడ్డి సత్తుపల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లకు న్యాక్ గుర్తింపు
కామారెడ్డి సత్తుపల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు తాజాగా న్యాక్ గుర్తింపు లభించింది.
19.నేడు మదర్ డెయిరీ చైర్మన్ ఎన్నిక

నల్గొండ రంగారెడ్డి జిల్లాలో పాల ఉత్పత్తిదారుల సహకార యూనియన్ డైరెక్టర్ పదవులకు జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ టిఆర్ఎస్ మద్దతుదారులు ఘనవిజయం సాధించారు ఈ సందర్భంగా చైర్మన్ ఎన్నికను ఈరోజు నిర్వహిస్తున్నారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 45,800 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 49,970
.