చలికాలంలో సూర్యరష్మీ ఎంత ముఖ్యమో తెలుసా..?

చలికాలంలో ప్రతి ఒక్కరు కూడా కచ్చితంగా సూర్య రష్మీ( Surya Rashmi ) తీసుకోవాలి.ఎందుకంటే ఈ చల్లటి వాతావరణంలో వెచ్చటి సూర్యకాంతి శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తుంది.

 Do You Know How Important Sunlight Is In Winter, Antibacterial Properties , Wint-TeluguStop.com

అంతేకాకుండా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.శరీరానికి ఆహారం ఎంత అవసరమో, ఆరోగ్యానికి, ఫిట్నెస్ కి, సూర్యరష్మి కూడా అంతే అవసరం.

అయితే ఆహారం నుండి శక్తిని పొందితే సూర్యకాంతి నుండి విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది.ఈ విటమిన్ డి, ఎముకల పెరుగుదల బలానికి చాలా ఉపయోగపడుతుంది.

అలాగే ఇది ఈ శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.ఇక వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది.

శీతాకాలంలో ప్రతిరోజు కొంత సమయం వరకు సూర్య రష్మి లో గడపడం చాలా అవసరం.అలా గడపడం వలన ఎలాంటి ప్రయోజనాలు దొరుకుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

అయితే సూర్యకాంతి నుండి విటమిన్ డీ( Vitamin D ) లభిస్తుంది.వాస్తవానికి మన శరీరం సూర్య రష్మికి గురైనప్పుడు మన శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది.

ఇది ఎముకలకు చాలా ఉపయోగపడుతుంది.దీని వలన క్యాల్షియం, శోషణలు సహాయపడుతుంది.

ఇక ఆ విటమిన్ డి లోపం కారణంగా ఎముకలు త్వరగా విరిగిపోయే ప్రమాదం ఉంటుంది.కాబట్టి విటమిన్ డి శరీరానికి చాలా అవసరం.

సూర్యరష్మి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

Telugu Antibacterial, Tips, Vitamin-Telugu Health

దీని కారణంగా ఎన్నో రకాల వ్యాధులు ఇన్ఫెక్షన్లతో పోరాడవచ్చు.అందుకే ప్రతిరోజు ఉదయం పూట కొద్దిసేపు సూర్య రష్మి లో గడపాలి.సూర్యకాంతిలో ఉండడం వలన శరీరంలో ఎండార్పింన్లు విడుదలవుతాయి.

ఇవి మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి.ఈ హార్మోన్ లు శరీరం, మనసును రిలాక్స్ చేస్తాయి.

అలాగే ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడతాయి.సూర్యకాంతిలో ఉండడం వలన మనసు ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుంది.

చలికాలంలో ఎండలో ఉండడం వలన ముఖం కూడా మెరుస్తుంది.

Telugu Antibacterial, Tips, Vitamin-Telugu Health

సూర్యకాంతిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ( Antibacterial properties )కూడా పుష్కలంగా ఉంటాయి.కాబట్టి ఇవి మొటిమలను దూరం చేస్తాయి.ఇక సూర్యరశ్మిని తీసుకోవడం వలన శరీరంలో అదనపు కేలరీలు ఉన్న కూడా బర్న్ అయిపోతాయి.

దీంతో బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది.కాబట్టి సూర్యరష్మి నుండి విటమిన్ డి పొందాలంటే ఉదయం 8 గంటల్లోపు ఎండలో ఉండాలి.

ఈ సమయంలో పది నిమిషాలు సూర్యరష్మీ తీసుకుంటే చాలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube