చలికాలంలో సూర్యరష్మీ ఎంత ముఖ్యమో తెలుసా..?

చలికాలంలో ప్రతి ఒక్కరు కూడా కచ్చితంగా సూర్య రష్మీ( Surya Rashmi ) తీసుకోవాలి.

ఎందుకంటే ఈ చల్లటి వాతావరణంలో వెచ్చటి సూర్యకాంతి శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తుంది.అంతేకాకుండా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.

శరీరానికి ఆహారం ఎంత అవసరమో, ఆరోగ్యానికి, ఫిట్నెస్ కి, సూర్యరష్మి కూడా అంతే అవసరం.

అయితే ఆహారం నుండి శక్తిని పొందితే సూర్యకాంతి నుండి విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది.

ఈ విటమిన్ డి, ఎముకల పెరుగుదల బలానికి చాలా ఉపయోగపడుతుంది.అలాగే ఇది ఈ శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

ఇక వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది.శీతాకాలంలో ప్రతిరోజు కొంత సమయం వరకు సూర్య రష్మి లో గడపడం చాలా అవసరం.

అలా గడపడం వలన ఎలాంటి ప్రయోజనాలు దొరుకుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.అయితే సూర్యకాంతి నుండి విటమిన్ డీ( Vitamin D ) లభిస్తుంది.

వాస్తవానికి మన శరీరం సూర్య రష్మికి గురైనప్పుడు మన శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది.

ఇది ఎముకలకు చాలా ఉపయోగపడుతుంది.దీని వలన క్యాల్షియం, శోషణలు సహాయపడుతుంది.

ఇక ఆ విటమిన్ డి లోపం కారణంగా ఎముకలు త్వరగా విరిగిపోయే ప్రమాదం ఉంటుంది.

కాబట్టి విటమిన్ డి శరీరానికి చాలా అవసరం.సూర్యరష్మి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

"""/" / దీని కారణంగా ఎన్నో రకాల వ్యాధులు ఇన్ఫెక్షన్లతో పోరాడవచ్చు.అందుకే ప్రతిరోజు ఉదయం పూట కొద్దిసేపు సూర్య రష్మి లో గడపాలి.

సూర్యకాంతిలో ఉండడం వలన శరీరంలో ఎండార్పింన్లు విడుదలవుతాయి.ఇవి మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి.

ఈ హార్మోన్ లు శరీరం, మనసును రిలాక్స్ చేస్తాయి.అలాగే ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడతాయి.

సూర్యకాంతిలో ఉండడం వలన మనసు ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుంది.చలికాలంలో ఎండలో ఉండడం వలన ముఖం కూడా మెరుస్తుంది.

"""/" / సూర్యకాంతిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ( Antibacterial Properties )కూడా పుష్కలంగా ఉంటాయి.

కాబట్టి ఇవి మొటిమలను దూరం చేస్తాయి.ఇక సూర్యరశ్మిని తీసుకోవడం వలన శరీరంలో అదనపు కేలరీలు ఉన్న కూడా బర్న్ అయిపోతాయి.

దీంతో బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది.కాబట్టి సూర్యరష్మి నుండి విటమిన్ డి పొందాలంటే ఉదయం 8 గంటల్లోపు ఎండలో ఉండాలి.

ఈ సమయంలో పది నిమిషాలు సూర్యరష్మీ తీసుకుంటే చాలు.

ప్రభాస్ మీద నెగిటివ్ కామెంట్లు చేస్తున్న బాలీవుడ్ క్రిటిక్స్…