పూజకు ఉపయోగించే మందారం పువ్వులు( Hibiscus flowers ) కేశ సంరక్షణకు కూడా ఎంతో అద్భుతంగా సహాయపడతాయని మనందరికీ తెలుసు.అయితే వాటిని ఎలా ఉపయోగించాలి అన్న అవగాహన కొందరికి ఉండదు.
మందారం పువ్వులు అనేక హెయిర్ కేర్ బెనిఫిట్స్ ను అదిస్తాయి.ముఖ్యంగా నాలుగు మందారం పువ్వులతో ఇప్పుడు చెప్పబోయే విధంగా చేశారంటే నెల రోజుల్లో మీ జుట్టు డబుల్ అవుతుంది.
అంటే ఒత్తుగా దట్టంగా పెరుగుతుంది.
అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ మెంతులు ( fenugreek )మరియు అవి మునిగేలా వాటర్ వేసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలి.
మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకొని అందులో మందారం పువ్వులు వేసుకోవాలి.అలాగే నైట్ అంతా నానబెట్టుకున్న మెంతులు, వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్( Aloe vera gel ), మూడు టేబుల్ స్పూన్లు పెరుగు, వన్ టీ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ ( Vitamin E oil )వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ మందారం పువ్వుల హెయిర్ మాస్క్ ను వేసుకుంటే జుట్టు ఎదుగుదలకు అవసరమయ్యే పోషణ లభిస్తుంది.జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.
పల్చటి కురులు కొద్దిరోజుల్లోనే దట్టంగా మారుతాయి.అలాగే ఈ మాస్క్ హెయిర్ ఫాల్ సమస్యను చాలా వేగంగా కంట్రోల్ చేస్తుంది.
పొడి జుట్టును నివారిస్తుంది కురులు స్మూత్ గా షైనీగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.అలాగే మందారం, పెరుగు, ఆలోవెర, మెంతులు, విటమిన్ ఇ, ఆయిల్ తల చర్మంలో తేమను నిలుపుకోవడంలో సహాయపడతాయి.చుండ్రు సమస్యను దూరం చేస్తాయి.మందారం పువ్వులు జుట్టుకు సహజంగా నల్లని రంగును ఇస్తుంది.తెల్ల జుట్టు సమస్యను దూరం చేస్తుంది.మందారంలో ఉండే పోషకాలు జుట్టును మూలాల నుంచి బలపరచి వేగంగా పెరిగేందుకు తోడ్పడతాయి.