డార్క్ నెక్( Dark Neck ) అనేది చాలా మందిని కలవర పెట్టే సమస్య.మెడ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచకపోవడం, సన్‌స్క్రీన్ వాడకపోవడం, మెడపై ఎక్కువ మలినాలు పేరుకుపోవడం, హార్మోన్ల అసమతుల్యత, మధుమేహం లేదా ఇన్‌సులిన్ రెసిస్టెన్స్, ఆహారపు అలవాట్లు, జీవనశైలి, పలు రకాల ముందుల వాడకం, ఎండల ప్రభావం తదితర కారణాల వల్ల మెడ నల్లగా మారుతుంటుంది.అయితే ఈ సమస్యను వదిలించడానికి ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలు ఎంతో అద్భుతంగా తోడ్పడతాయి.
టిప్-1:
ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టీ స్పూన్లు ఆపిల్ సిడర్ వినిగర్( Apple Cider Vinegar ) మరియు రెండు టీ స్పూన్లు రోజ్ వాటర్( Rose Water ) వేసుకుని బాగా మిక్స్ చేసి మెడకు ఒకటికి రెండుసార్లు అప్లై చేసుకోవాలి.పదిహేను నిమిషాల అనంతరం వాటర్ తో శుభ్రంగా మెడను క్లీన్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఇలా చేశారంటే మెడ నలుపు క్రమంగా మాయమవుతుంది.

టిప్-2:
ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ అలోవెర జెల్,( Aloevera Gel ) రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్( Lemon Juice ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని మెడకు అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.ఇరవై నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి.ఆలోవెరా చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి మృదువుగా చేస్తుంది.లెమన్ జ్యూస్ నలుపుదనాన్ని తగ్గించి మెడను తెల్లగా, కాంతివంతంగా మెరిపిస్తుంది.

టిప్-3:
రెండు టీస్పూన్లు బేకింగ్ సోడాను తగినంత నీటితో పేస్టులా తయారు చేసుకోండి.ఈ పేస్టును మెడపై రాసి మృదువుగా రుద్దండి.పది నిమిషాలు ఆరనిచ్చి.
ఆ తరువాత చల్లని నీటితో శుభ్రం చేయండి.బేకింగ్ సోడా డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగిస్తుంది.
నలుపును క్రమంగా పొగొట్టి మెడను తెల్లగా మెరిపిస్తుంది.అయితే ఈ రెమెడీనికి వారానికి ఒకసారి మాత్రమే ప్రయత్నించండి.
ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం అస్సలు మరవకండి.